For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: భారీగా షాకిచ్చిన బంగారం ధరలు, రూ.48,000 క్రాస్

|

బంగారం ధర నిన్న భారీగా పెరిగింది. నేడు(గురువారం 15 జూలై) కూడా పైపైకి చేరుకుంది. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.48,000 క్రాస్ చేసి రూ.48,300 వద్ద ముగిసింది. నేడు మరింత పెరిగి రూ.48,500ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న 1825 డాలర్లను తాకింది. నేడు ప్రారంభ సెషన్‌లోమో 7 డాలర్లకు పైగా ఎగిసి 1830 డాలర్లను క్రాస్ చేసింది. మొన్నటి వరకు తగ్గిన సిల్వర్ ఫ్యూచర్స్ రెండు రోజులుగా మళ్లీ పెరుగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7,700 తక్కువగా ఉంది.

నేడు ధరలు ఎలా ఉన్నాయంటే

నేడు ధరలు ఎలా ఉన్నాయంటే

నిన్న భారీగా పెరిగి రూ.48,300 వద్ద సెటిల్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభంలో స్వల్పంగా తగ్గినప్పటికీ, తిరిగి పుంజుకుంది. మధ్యాహ్నం గం.1 సమయానికి రూ.160 వరకు పెరిగి రూ.48,484 వద్ద ట్రేడ్ అయింది. నేడు ఓ సమయంలో రూ.48,500ను దాటేసింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.175.00 పెరిగి రూ.48,753 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.401 పెరిగి రూ.69,813 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.448 ఎగిసి రూ.71,100 వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ధర ఎలా ఉండవచ్చు

బంగారం ధర ఎలా ఉండవచ్చు

ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000 దాటి రూ.48,500 దిశగా పరుగు పెడుతోంది. బంగారం ఈ వారం రూ.48,350 నుండి రూ.48,525 మధ్య కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం మద్దతు ధర రూ.48,000, నిరోధకస్థాయి రూ.48,550. సిల్వర్ మద్దతు ధర రూ.68,800, నిరోధకస్థాయి రూ.70,000. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర 1820 డాలర్లు.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 8.05 (0.44%) డాలర్లు ఎగిసి 1,833.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,824.45 - 1,834.60 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.191 (0.73%) డాలర్లు పెరిగి 26.457 డాలర్ల వద్ద కదలాడింది. నేడు 26.242 - 26.473 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold Price Today: భారీగా షాకిచ్చిన బంగారం ధరలు, రూ.48,000 క్రాస్ | Gold Price Today: Yellow metal near four week low at Rs 48,460

August Gold future Price Today Trading Flat at RS.48,458 at multi commodity exchange(MCX) on Thursday morning.
Story first published: Thursday, July 15, 2021, 14:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X