For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.50,000పైకి.. పెరిగిన బంగారం ధరలు, వెండి రూ.500 జంప్

|

ముంబై: నిన్న రూ.50,000 దిగువకు వచ్చిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో శుక్రవారం (నవంబర్ 20) ఉదయం గం.11.15 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 177.00 (0.35%) పెరిగి 50,169.00 వద్ద ట్రేడ్ అయింది.

రూ.50,041.00 వద్ద ప్రారంభమై, రూ.50,197.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 158.00 (0.32%) ఎగిసి రూ.50,170.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,015.00 వద్ద ప్రారంభమై, రూ.50,185.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,015.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

లగ్జరీ వస్తువులకు కరోనా దెబ్బ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకోవచ్చునంటే?లగ్జరీ వస్తువులకు కరోనా దెబ్బ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకోవచ్చునంటే?

పసిడి దారిలోనే వెండి...

పసిడి దారిలోనే వెండి...

పసిడి ధర రూ.170 వరకు పెరగగా, కిలో వెండి ధర దాదాపు రూ.500 వరకు పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.390.00 (0.63%) పెరిగి రూ.61,900.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,610.00 వద్ద ప్రారంభమై, రూ.62,090.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,610.00 కనిష్టాన్ని తాకింది.

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 413.00 (0.65%)పెరిగి రూ.63,696.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,450.00 వద్ద ప్రారంభమై, రూ.63,822.00 గరిష్టాన్ని, రూ.63,450.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 6.15 (+0.33%) డాలర్లు పెరిగి 1,867.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,861.15 - 1,867.15 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,861.50 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో బంగారం 23.92 శాతం మేర పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ +0.162 (+0.67%) డాలర్లు పెరిగి 24.207 డాలర్లు పలికింది. 24.075 - 24.242 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.048 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి 38.53 శాతం పెరిగింది.

రూ.6000 తక్కువ

రూ.6000 తక్కువ

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు చాన్నాళ్లకు నిన్న రూ.50,000 దిగువకు వచ్చాయి. అయితే అంతలోనే మళ్లీ మార్కును దాటాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.6,000 తక్కువగా ఉంది. రెండు మూడు నెలలుగా ధరలు రూ.49,500 నుండి రూ.52,000 మధ్య ట్రేడ్ అవుతోంది. వెండి ఫ్యూచర్ ఆగస్ట్ 7 గరిష్టం రూ.79వేల నుండి రూ.18 వేల వరకు తక్కువగా ఉంది.

English summary

రూ.50,000పైకి.. పెరిగిన బంగారం ధరలు, వెండి రూ.500 జంప్ | Gold price today: Yellow metal holds steady, above Rs 50,000 today

Investors can look to but the dips towards Rs 49,800, say experts. A rise in virus cases, mixed economic data, and central banks' commitment towards additional measures are supporting gold prices.
Story first published: Friday, November 20, 2020, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X