For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన ధర, ఆల్‌టైం గరిష్టంతో బంగారం ధరలు రూ.7000 తక్కువ

|

దేశీయ స్టాక్ మార్కెట్లో బంగారం సోమవారం (డిసెంబర్ 7) స్వల్పంగా పెరిగాయి. అంతకుముందు మూడు వారాలపాటు తగ్గిన ధర గతవారంలో రూ.1200కు పైగా పెరిగింది. చివరి సెషన్‌లో స్వల్పంగా తగ్గినప్పటికీ మొత్తంగా క్రితంవారం పెరిగింది. ఈ వారం కూడా ప్రారంభంలో పెరుగుదల కనిపిస్తోంది. పసిడి ధర పెరగగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోను ఇదే ఒరవడి కనిపించింది. పసిడి స్వల్పంగా పెరగగా, వెండి తగ్గింది.

కస్టమర్ల సేవలకు ఇబ్బందిలేదు: RBI ఆదేశాలపై HDFC, అసలేం జరిగింది?కస్టమర్ల సేవలకు ఇబ్బందిలేదు: RBI ఆదేశాలపై HDFC, అసలేం జరిగింది?

బంగారం ధరలు జంప్

బంగారం ధరలు జంప్

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ప్రారంభ సెషన్లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.123.00 (0.25%) పెరిగి రూ.49,295.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,231.00 ప్రారంభమై, రూ.49,320.00 గరిష్టాన్ని తాకి, రూ.49,217.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.127.00 (0.26%) పెరిగి రూ.49351.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,388.00 వద్ద ప్రారంభమై, రూ.49,388.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,342.00 కనిష్టాన్ని తాకింది.

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్..

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్..

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.89.00 (-0.14%) పెరిగి రూ.63724.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,643.00 వద్ద ప్రారంభమై, రూ.63,777.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,617.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ రూ.64619.00 వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7,000 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో పోలిస్తే రూ.15వేల వరకు తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 5.50 (+0.30%) డాలర్లు పెరిగి 1,845.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,836.75 - 1,844.75 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1840 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 23.54 శాతం పెరిగింది.

సిల్వర్ ధరలు ఔన్స్ 0.044 (+0.18%) డాలర్లు 24.297 డాలర్లకు పెరిగింది. 24.148 - 24.365 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.253 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి 44.82 డాలర్లు పెరిగింది.

English summary

పెరిగిన ధర, ఆల్‌టైం గరిష్టంతో బంగారం ధరలు రూ.7000 తక్కువ | Gold Price Today: Yellow metal down Rs 7000 from record highs

Gold and silver prices were mixed today in Indian markets as optimism around COVID-19 vaccines roll-outs offset hopes of a US stimulus package being passed this week. On MCX, gold prices edged 0.15% higher to ₹49271 per 10 gram while silver rates fell 0.2% to ₹63684 per kg.
Story first published: Monday, December 7, 2020, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X