For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పడిపోయిన పసిడి ధరలు, రూ.440 డౌన్: వెండి రూ.1300 తగ్గింది

|

బంగారం ధరలు నేడు(మే 4 మంగళవారం) భారీగా క్షీణించాయి. నిన్నటి వరకు రూ.47,000కు పైనే ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఈస్థాయి దిగువకు వచ్చింది. నిన్న దాదాపు రూ.600 పెరిగి రూ.47,300 దాటిన 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్, నేడు మాత్రం దాదాపు రూ.500 వరకు తగ్గింది. వెండి ఫ్యూచర్ ధరలు కూడా రూ.1300 క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ కీలక 1775 డాలర్ల దిగువకు రాగా, సిల్వర్ ఫ్యూచర్స్ 27 డాలర్ల దిగువకు క్షీణించింది. గత ఏడాది ఆగస్ట్ 56,200తో బంగారం ధర ప్రస్తుతం రూ.9450 తక్కువగా ఉంది. గత నెలలో ఓ సమయంలో రూ.12000కు పైగా కూడా తగ్గింది. ఈ కాలంలో పసిడి రూ.2500కు పైగా పెరిగింది.

భారీగా తగ్గిన బంగారం ధర

భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు క్రితం సెషన్లో రూ.600 వరకు పెరిగాయి. గత నెలలో ఓ సమయంలో రూ.44,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,000కు దిగువకు పడిపోయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.441.00 (0.93%) తగ్గి రూ.46878.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,226.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,451.00 గరిష్టాన్ని, రూ.46,717.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.439.00 (0.92%) తగ్గి రూ.47203.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,579.00 వద్ద ప్రారంభమై, రూ.47,760.00 గరిష్టాన్ని, రూ.47,091.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.69వేల దిగువకు వెండి

రూ.69వేల దిగువకు వెండి

వెండి ఫ్యూచర్ ధరలు నేడు భారీగా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.1,317.00 (1.88%) తగ్గి రూ.68554.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,898.00 వద్ద ప్రారంభమై, రూ.70,162.00 గరిష్టాన్ని, రూ.69,519.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,370.00 (1.93%) తగ్గి రూ.69530.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,611.00 ప్రారంభమైన ధర, రూ.71,419.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,909.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 1780 డాలర్లకు దిగువన పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 16.25 (0.91%) డాలర్లు పెరిగి 1,775.55 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,770.35 - 1,798.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 0.512 (1.90%)డాలర్లు తగ్గి 26.448 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.168 - 27.233 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

భారీగా పడిపోయిన పసిడి ధరలు, రూ.440 డౌన్: వెండి రూ.1300 తగ్గింది | Gold Price Today: Yellow metal cheaper by Rs 9,100 from record level

After strong rally on Monday, gold and silver prices are once again trading weaker on Tuesday. Yesterday, gold had become expensive by Rs 600 while silver also increased by Rs 2470, ie, about four and a half percent higher.
Story first published: Tuesday, May 4, 2021, 22:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X