బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.15% తగ్గి రూ.43,676 వద్ద, కిలో వెండి ధర 0.16% తగ్గి రూ.46,198 వద్ద నిలిచింది. అంతకుముందు సెషన్‌లో కూడా బంగారం ధరలు భారీగానే తగ్గాయి. బంగారం కొనుగోలు చేస్తే 12.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.4% తగ్గి 1,656.37 డాలర్లుగా ఉంది. అంతకుముందు సెషన్‌లో రెండు శాతం పడిపోయింది. అయితే వెండి ధర మాత్రం పెరిగింది. ఔన్స్ వెండి 1.3 శాతం పెరిగి 17.08 డాలర్లుగా ఉంది. ప్లాటినమ్ ధర 0.8 శాతం పెరిగి 875.37 డాలర్లుగా ఉంది. బంగారం ధర రూ.44,000 దిశగా వెళ్తోందని, రూ.43,500 మద్దతు ధర అని చెబుతున్నారు. వెండి మద్దతు ధర కిలో రూ.46,200గా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో రూ.33వేలు ఉన్న బంగారం ఏడాది తిరిగేసరికి రూ.44వేల పైకి చేరుకుంది. దాదాపు 11వేలకు పైగా పెరిగింది.

కాగా, గత ఏడాది కాలంలో బంగారం పెరిగిందిలా..
బంగారం ధరలు ఏడాది వ్యవధిలోనే భారీగా పెరిగాయి.
2019 జనవరిలో రూ.33056
ఫిబ్రవరిలో రూ.32981
మార్చిలో రూ.31734
ఏప్రిల్‌లో రూ.31756
మేలో రూ.32098
జూన్‌లో రూ.34206
జూలైలో రూ.34517
ఆగస్ట్‌లో రూ.38656
సెప్టెంబర్‌లో రూ.36913
అక్టోబర్‌లో రూ.38578
నవంబర్‌లో రూ.38031
డిసెంబర్‌లో రూ.39108
2020 జనవరిలో రూ.41000
ఫిబ్రవరి 24వ తేదీ నాటికి రూ.44,472గా ఉంది.


Click it and Unblock the Notifications