For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.9300 తక్కువ, కొనుగోలు చేయవచ్చా?

|

బంగారం ధరలు నిన్న (బుధవారం) స్వల్పంగా లాభపడ్డాయి. నేడు (గురువారం అక్టోబర్ 7) ప్రారంభ సెషన్‌లో దాదాపు స్థిరంగా లేదా అతి స్వల్పంగా క్షీణించాయి. నేటి ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.62.00 (-0.13%) తగ్గి రూ.46845.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.79.00 (-0.17%) క్షీణించి రూ.47032.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.29.00 (0.05%) పెరిగి రూ.61032.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.32.00 (0.05%) పెరిగి రూ.61500.00 వద్ద ట్రేడ్ అయింది. నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి.

ఈ వారం రూ.46,000 స్థాయిలో ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,000 దిశగా కనిపిస్తోంది. అదే సమయంలో రూ.60,000 స్థాయిలో ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,000 దాటింది. బంగారం ధరలు గత ఏడాది (2020) ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.9,350 తక్కువగా ఉన్నాయి.

ఏడాదిలో 9 శాతం తగ్గిన ధర

ఏడాదిలో 9 శాతం తగ్గిన ధర

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ కాస్త క్షీణించినప్పటికీ 1760 డాలర్ల వద్ద కదలాడుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ అయితే 22.5 డాలర్లను క్రాస్ చేసింది. ఇటీవల 1780 డాలర్ల దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత కాస్త చల్లబడింది. నేటి ప్రారంభ సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 2.25(-0.13%) డాలర్లు క్షీణించి 1,759.55 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.055 (+0.24%) డాలర్లు ఎగిసి 22.587 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారం 52 వారాల గరిష్టం రూ.1978.40 డాలర్లు కాగా, కనిష్టం 1677.90 డాలర్లు. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1762 డాలర్ల సమీపంలో క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏడాదిలో బంగారం ధర దాదాపు 9 శాతం క్షీణించింది. కామెక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2072 డాలర్లతో 300 డాలర్లకు పైగా తక్కువ ఉంది.

పసిడిపై ప్రభావం

పసిడిపై ప్రభావం

బెంచ్ మార్క్ యూఎస్ టెన్ ఇయర్ బాండ్ యీల్డ్ ట్రెజరీ మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ యూఎస్ ఏడీపీ నాన్-ఫామ్ ఎంప్లాయిమెంట్ చేంజ్ డేటా కాస్త సానుకూలంగా ఉంది. అంచనాలకు మించి 568000గా ఉంది. ఇన్వెస్టర్లు ఈ వారంలో విడుదలయ్యే జాబ్ డేటా గురించి వేచి చూస్తున్నారు. ఈ అంశాలు బంగారంపై ప్రభావం చూపుతాయి. దేశీయ మార్కెట్ విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ సమావేశం నిన్న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఉండే ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పైన, పసిడి మార్కెట్ పైన ఉంటుంది.

మద్దతు ధర, నిరోధకస్థాయి

మద్దతు ధర, నిరోధకస్థాయి

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధరలు రూ.46,650, రూ.46, 460, నిరోధకస్థాయి రూ.47,180, రూ.47,500. సిల్వర్ ఫ్యూచర్స్ మద్దతు ధరలు రూ.61,000, 61,520, నిరోధకస్థాయి రూ.61,450, రూ.62,000.

వివిధ నగరాల్లో బంగారం ధరలు

- చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.43,920

- ముంబైలో 22 క్యారెట్ల పసిడి రూ.45,680

- ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.45,750

- కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి రూ.46,000

- బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.43,600

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.43,600

- కేరళలో 22 క్యారెట్ల పసిడి రూ.43,600

- పుణేలో 22 క్యారెట్ల పసిడి రూ.44,850

- అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.44,580.

- జైపూర్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.45,400

- లక్నోలో 22 క్యారెట్ల పసిడి రూ.44,100.

- పాట్నాలో 22 క్యారెట్ల పసిడి రూ.44,850.

- నాగపూర్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.45,680.

English summary

Gold Price Today: ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.9300 తక్కువ, కొనుగోలు చేయవచ్చా? | Gold Price Today: Rs 9,350 down from all time high

On MCX, October gold contracts fell 0.11 per cent to Rs 46,854 for 10 grams on October 7.
Story first published: Thursday, October 7, 2021, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X