For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price today: బంగారం ధరలు తగ్గాయి, కానీ రూ.49,000కు పైనే

|

బంగారం ధరలు ఈ వారం తీవ్ర ఊగిసలాటలో ఉన్నాయి. అయినప్పటికీ రూ.49,000 పైనే కదలాడుతున్నాయి. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించడంతో నేటి ప్రారంభ సెషన్‌లో ఇక్కడ కూడా తగ్గాయి. అయితే నేడు(శుక్రవారం, నవంబర్ 19) అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్(MCX)లో ఉదయం గం.9.30 సమయానికి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.224.00 (-0.45%) క్షీణించి రూ.49068.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.190.00 (-0.38%) తగ్గి రూ.49320.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న క్షీణించిన పసిడి ధరలు నేడు పెరిగాయి. క్రితం సెషన్‌లో 1,861.40 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ఈ వార్త రాసే సమయానికి 3.50
(+0.19%) డాలర్లు పెరిగి 1,864.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,859.65 - 1,864.70 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. బంగారం ధర ఏడాదిలో 1.44 శాతం తగ్గింది.

సిల్వర్ ఫ్యూచర్స్

సిల్వర్ ఫ్యూచర్స్

వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 25 డాలర్ల దిగువకు వచ్చాయి. దేశీయ మార్కెట్లో రూ.66,000 పైన పలికిన సిల్వర్ ఫ్యూచర్స్ ఈ మార్కు దిగువకు వచ్చింది. నేటి ప్రారంభ సెషన్‌లో కిలో వెండి రూ.700.00 (-1.05%) తగ్గి రూ.65925.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.626.00 (-0.93%) క్షీణించి రూ.66901.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం నేడు స్వల్పంగా పెరిగాయి. 0.077 (+0.31%) డాలర్లు పెరిగిన సిల్వర్ ఫ్యూచర్స్ 24.977 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 24.820 - 24.988 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 0.39 శాతం పెరిగింది.

పసిడిపై డాలర్ ప్రభావం

పసిడిపై డాలర్ ప్రభావం

ఇటీవల డాలర్ వ్యాల్యూ పెరుగుతోంది. సిక్స్ కరెన్సీ బకెట్‌లో ఇతర కరెన్సీతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ జూలై 2020 గరిష్టానికి చేరుకుంది. బుధవారం 96.226 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత కాస్త క్షీణించినప్పటికీ 95 డాలర్ల పైనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్భణం మధ్య కేంద్ర బ్యాంకు గట్టి అంచనాల నేపథ్యంలో గ్రీన్ బ్యాక్‌లో కదలిక చోటు చేసుకుంది. గతవారం ద్రవ్యోల్బణ ఆందోళనల మధ్య యూఎస్ రిటైల్ విక్రయాలు అంచనాలను మించాయి. మరోవైపు ఐరోపాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కార్లు, వెహికిల్ అమ్మకాలు వరుసగా నాలుగో నెల క్షీణించాయి. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తక్కువగానే కొనసాగిస్తున్నారు. వీటి ప్రభావం పసిడి పైన ఉంటుంది.

మద్దతు ధర, నిరోధకస్థాయి

మద్దతు ధర, నిరోధకస్థాయి

బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగానే ముగిసే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 1850 డాలర్లకు పైన క్లోజ్ కావొచ్చునని అంచనా వేస్తున్నారు. బంగారం 1850 డాలర్ల దిగువకు వస్తే మాత్రం 1845 డాలర్లకు, ఆ స్థాయి కంటే కిందకు పడిపోతే 1835 డాలర్లకు తగ్గవచ్చునని అంటున్నారు. నిరోధకస్థాయి 1,870 డాలర్లు. ఆ స్థాయి దాటితే 1877 డాలర్లకు చేరుకోవచ్చు.

English summary

Gold Price today: బంగారం ధరలు తగ్గాయి, కానీ రూ.49,000కు పైనే | Gold Price today: Precious metals record marginal dip on MCX

The price of gold on Friday in Asia has been drifting sideways but the needle has now moved to the upside. The price is breaking out of the prior range of between $1,858.10 and $1,860.42 and has just printed a high of $1.861.77.
Story first published: Friday, November 19, 2021, 10:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X