For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం ధరలు, రూ.49,000 దిగువకు పసిడి: వెండి రూ.72,000కు పైనే

|

బంగారం ధరలు నేడు (శుక్రవారం, 11 జూన్) ప్రారంభ సెషన్‌లో స్థిరంగా ఉన్నప్పటికీ సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు ఉదయం రూ.500 వరకు పెరిగినప్పటికీ సాయంత్రానికి రూ.200 వరకు పెరుగుదలతో ఉన్నాయి. కరోనా మహమ్మారి కేసులు తగ్గడం, వివిధ రకాల వ్యాక్సినేషన్ పెరుగుతుండటం బంగారంపై ఒత్తిడిని తగ్గించింది. ఉదయం వరకు రూ.49,000కు పైగా ఉన్న పసిడి ధరలు నేడు సాయంత్రానికి ఆ మార్కు కిందకు వచ్చాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి ధరలు బంగారం ధరలు రూ.7,300 వరకు తక్కువగా ఉంది. బంగారం ధరలు వరుసగా ఆరో రోజు ఒత్తిడిలో ఉన్నాయి.

తగ్గిన బంగారం ధరలు

తగ్గిన బంగారం ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.228.00 (0.46%) తగ్గి రూ.48970.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,283.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,399.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,873.00 వద్ద కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.151.00 (0.31%) తగ్గి రూ.49335.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,560.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,709.00 గరిష్టాన్ని, రూ.49,251.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప తగ్గుదల

వెండి స్వల్ప తగ్గుదల

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.218.00 (0.30%) పెరిగి రూ.72217.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,249.00 వద్ద ప్రారంభమై, రూ.72,798.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.72,066.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.260.00 (0.36%) పెరిగి రూ.73412.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,500.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,942.00 గరిష్టాన్ని, రూ.73,259.00 కనిష్టాన్ని తాకింది

అక్కడ భారీ తగ్గుదల

అక్కడ భారీ తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 1900 డాలర్ల వద్ద ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1880 డాలర్ల స్థాయికి వచ్చింది. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు తగ్గగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 15.25 (0.80%) డాలర్లు తగ్గి 1,881.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,877.05 - 1,906.05 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. 0.117

(0.42%) డాలర్లు తగ్గి 28.148 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.032 - 28.442 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

తగ్గిన బంగారం ధరలు, రూ.49,000 దిగువకు పసిడి: వెండి రూ.72,000కు పైనే | Gold Price Today: Gold down Rs 228, silver price rises to rs 727,217

Gold prices down Rs 228 to Rs 48,970 per 10 gram in the MCX on Friday. Gold prices in India continued to struggle for the sixth day in a row, moving in a very narrow range.
Story first published: Friday, June 11, 2021, 22:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X