For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్నటి వరకు షాక్, నేడు సర్‌ప్రైజ్! రూ.1300 తగ్గిన బంగారం ధర, వెండి రూ.2వేలు డౌన్

|

ముంబై: గత రెండు రోజుల్లో రూ.1500 భారీ మొత్తంలో పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు నేడు (బుధవారం, జనవరి 6) దాదాపు అదే స్థాయిలో తగ్గాయి. ఈరోజు ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి, ఆ తర్వాత అదే ఒరవడిని కొనసాగించింది. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధర రూ.50,000కు పైనే కదలాడుతోంది. రెండు రోజులుగా రూ.51,000 పైన ఉంది. నేడు ఆ మార్కు దిగువకు వచ్చింది. మొన్న ఒక్కరోజే రూ.1200 వరకు పెరిగిన పసిడి ధర, నిన్న రూ.300కు పైగా ఎగిసింది. ఈ రోజు రూ.1300 మేర క్షీణించింది.

బంగారం ధరలు భారీగా డౌన్

బంగారం ధరలు భారీగా డౌన్

నేడు (బుధవారం, 6) ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 1,292.00 (-2.50%) తగ్గి రూ.50428.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,555.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,875.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,401.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.5800 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,246.00 (-2.41%) తగ్గి రూ.50485.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,610.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,931.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,455.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.1900 వరకు డౌన్

వెండి రూ.1900 వరకు డౌన్

సిల్వర్ ఫ్యూచర్స్ భారీగా తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 1,897.00 (-2.68%) క్షీణించి రూ.68961.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,323.00 వద్ద ప్రారంభమై, రూ.71,550.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,580.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,922.00 (-2.68%) తగ్గి రూ.69900.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,326.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,647.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

బంగారం 1950 డాలర్లు క్రాస్

బంగారం 1950 డాలర్లు క్రాస్

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1950 డాలర్ల దిగువకు వచ్చింది. అయినప్పటికీ 1900 డాలర్ల పైనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 46.80 (2.39%) డాలర్లు తగ్గి 1,907.70 డాలర్లు పలికింది. నేటి సెషన్లో 1,902.70 - 1,962.45

డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 22.24% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర -0.660 (-2.39%) డాలర్లు తగ్గి 26.980 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.705 - 28.105 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 50.44 శాతం పెరిగింది.

English summary

నిన్నటి వరకు షాక్, నేడు సర్‌ప్రైజ్! రూ.1300 తగ్గిన బంగారం ధర, వెండి రూ.2వేలు డౌన్ | Gold Price Today: Gold declines Rs 1300 to 50,430

Gold prices fell Rs 1300 to Rs 50,430 per 10 grams in the MCX on Wednesday amid rupee appreciation.
Story first published: Wednesday, January 6, 2021, 22:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X