For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: రూ.47,000 స్థాయికి.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

|

బంగారం ధరలు నేడు (సోమవారం, ఫిబ్రవరి 15) స్వల్పంగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా పసిడి ధరలు రూ.48,000కు అటుఇటు తచ్చాడుతున్నాయి.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో(MCX) నేడు ఓ సమయంలో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,229 వద్ద కనిష్టాన్ని తాకింది. తద్వారా రూ.47,000 దిగువకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఈ మార్క్ దిగువకు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేని పరిస్థితి. కరోనా తగ్గడం. వ్యాక్సినేషన్ నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి తగ్గుతోంది.

బంగారం ధరలు స్థిరంగా

బంగారం ధరలు స్థిరంగా

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు అతిస్వల్పంగా తగ్గింది. ప్రారంభ సెషన్లో పెరిగినప్పటికీ, ఆ తర్వాత తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.35.00 (0.07%) పెరిగి రూ.47,283.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,436.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,455.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,229.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.90.00 (0.19%) తగ్గి రూ.47,421 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,434.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,534.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,391.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ జంప్

సిల్వర్ జంప్

వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ.70,000 దిశగా కనిపిస్తోంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.763.00 (1.10%) పెరిగి రూ.69,880.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,241.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.760.00 (1.08%) పెరిగి రూ.70,955.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,940.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,277.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,685.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1820 డాలర్ల దిగువకు

1820 డాలర్ల దిగువకు

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1820 డాలర్లకు దిగువ వచ్చింది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 3.90

(0.21%) డాలర్లు తగ్గి 1819.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,815.60 - 1,827.00 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 13.44 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. ఔన్స్ ధర 0.320

(+1.17%) డాలర్లు పెరిగి 27.648 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.460 - 27.802 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 54.33 శాతం పెరిగింది.

English summary

Gold Price Today: రూ.47,000 స్థాయికి.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? | Gold Price Today: Gold declines marginally, silver gains

Gold prices declined marginally by Rs 19 to Rs 46,826 per 10 gram in the national capital on Monday in line with weak global cues and rupee appreciation, according to HDFC Securities. In the previous trade, the precious metal had closed at Rs 46,845 per 10 gram.
Story first published: Monday, February 15, 2021, 22:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X