For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేటి బంగారం ధర: కొద్దిరోజులు ఒడిదుడుకుల, ఆ తర్వాత నిలకడగా.. పెరుగుదల

|

బంగారం ధరలు ఈ రోజు (ఆగస్ట్ 14) తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు ఉదయం 0.8 శాతం తగ్గి రూ.52,495 పలికింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 3 శాతం క్షీణించి రూ.68,886 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం స్పాట్ గోల్డ్ స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1952 డాలర్లకు పైగా పలికింది. అయితే ఈవారంలో మాత్రం ఔన్స్ పసిడి 4 శాతానికి పైగా తగ్గింది. జూన్ మాసం నుండి ఒక వారంలో అత్యంత తగ్గుదల నమోదు కావడం ఇదే మొదటిసారి.

అక్కడ తగ్గినా.. ఇక్కడ పెరిగిన బంగారం ధరలు, దీపావళి నాటికి రూ.65,000?అక్కడ తగ్గినా.. ఇక్కడ పెరిగిన బంగారం ధరలు, దీపావళి నాటికి రూ.65,000?

మరికొద్ది రోజులు ఒడిదుడుకులు.. ఆ తర్వాత నిలకడగా పెరుగుదల

మరికొద్ది రోజులు ఒడిదుడుకులు.. ఆ తర్వాత నిలకడగా పెరుగుదల

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు నాలుగు రోజుల క్రితం రష్యా ప్రకటించిన అనంతరం ఇన్వెస్టర్లు బంగారంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో పసిడిపై ప్రభావం పడి, తగ్గుముఖం పట్టింది. మరికొద్ది రోజులు బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగి ఆపై నిలకడగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనాతో పాటు ఆర్థిక అనిశ్చితి, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం బంగారంపై ప్రభావం చూపాయి. ఈ ఏడాది 30 శాతానికి పైగా ధరలు పెరిగాయి.

తగ్గుదల రూ.3,000కు పైగా

తగ్గుదల రూ.3,000కు పైగా

గత నాలుగు రోజుల్లో బంగారం రూ.4000కు పైగా తగ్గింది. సోమవారం స్వల్పంగా పెరిగింది. తగ్గుదల, పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా ఈ వారంలో రూ.3 వేలకు పైగా పెరిగింది. దేశీయ మార్కెట్లో రూ.52,300 నుండి రూ.53,000 మధ్య, అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1,930 నుండి 1,965 మధ్య మద్దతు ఉంటుందని భావిస్తున్నారు.

మద్దతు.. ప్రతిఘటన

మద్దతు.. ప్రతిఘటన

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 1865 వద్ద బలమైన మద్దతు ఉందని, 1980 డాలర్ల వద్ద ప్రతిఘటన ఎదుర్కొంటుందని మరికొందరు కమోడిటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకున్న అనంతరం రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని మోతీలాల్ ఓస్వాల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.

English summary

నేటి బంగారం ధర: కొద్దిరోజులు ఒడిదుడుకుల, ఆ తర్వాత నిలకడగా.. పెరుగుదల | Gold price today eases from highs, buy on dips for a target above Rs 53,000

Gold prices in India eased on August 14 after rallying in the previous trading session. On the Multi-Commodity Exchange (MCX), October gold contracts were trading lower by 0.6 percent at Rs 52,580 per 10 gram at 0915 hours. Silver was at Rs 70,259 per kg, down 1.1 percent.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X