For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ సమయంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి

|

బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్ల అప్రమత్తత నేపథ్యంలో దాదాపు ప్రతిరోజు స్వల్పంగా పెరుగుతుండటం గమనార్హం. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి(అక్టోబర్ 20 బుధవారం) ప్రారంభ సెషన్‌లో రూ.95.00 (0.20%) పెరిగి రూ.47375.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.187.00 (0.39%) పెరిగి రూ.47573.00 వద్ద క్లోజ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉంది. నిన్న భారీగా పెరిగిన డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.14 తగ్గి రూ.64,436 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.12 ఎగిసి రూ.65,000 వద్ద ట్రేడ్ అయింది.అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ +3.10 (+0.18%) డాలర్లు లాభపడి 1,773.60 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.078 (-0.33%) క్షీణించి 23.805 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 1,767.10 - 1,774.65 డాలర్ల మధ్య కదలాడింది. పండుగ సమయంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి.

నిన్న లాభాల్లో ముగిసి..

నిన్న లాభాల్లో ముగిసి..

బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో నిన్న దాదాపు స్థిరంగా ముగిశాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా రూ.9 పెరిగి రూ.47,300 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం భారీగా ఎగిసింది. దాదాపు రెండు శాతం మేర పెరిగి వెండి కొనుగోలుదారులకు నిన్న షాకిచ్చింది. నిన్న రూ.1158 పెరిగి రూ.64,424 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో రూ.65,250ని కూడా తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1770 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 23.883 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏడాదిలో 8.27 శాతం క్షీణించాయి. 52 వారాల గరిష్టం 1978, 52 వారాల కనిష్టం 1677.90 డాలర్లు.

కామెక్స్‌లో బంగారం ఆల్ టైమ్ గరిష్టం 2072 డాలర్లతో 300 డాలర్లకు పైగా తక్కువగా ఉంది. ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8900 వరకు తక్కువగా ఉంది.

బంగారం రికవరీ

బంగారం రికవరీ

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రికవరీ కనిపించడంతో బంగారం ధరలు ఇటీవల క్షీణించాయి. కానీ వివిధ పరిణామాలు పెరుగుదలకు కారణమయ్యాయి. గతవారం ఓ సమయంలో 1800 డాలర్లను సమీపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత 30 డాలర్ల మేర తగ్గింది. కానీ ఈ వారం మళ్లీ పెరుగుతోంది.

దేశీయంగా చూస్తే బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో భారీగా పెరిగి 2,400 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. మన కరెన్సీలో ఇది రూ.1,80,000 కోట్లు. యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ ఇటీవల వరుసగా బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయని బులియన్ మార్కెట్ చెబుతున్నారు.

మద్దతు ధర

మద్దతు ధర

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1,755-17,44 డాలర్లు. నిరోధకస్థాయి 1,784-1,800 డాలర్లు. వెండి మద్దతు ధర 23.55-23.20. నిరోధకస్థాయి 24.10-24.40 డాలర్లు.

ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,050-రూ.46,800. నిరోధకస్థాయి రూ.47,550-రూ.47,770. వెండి మద్దతు ధర రూ.63,900-63,300. నిరోధకస్థాయి రూ.64,800-65,500.

బంగారాన్ని రూ.46,880 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.47,550 టార్గెట్ ధరతో రూ.47,100 కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

English summary

పండుగ సమయంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి | Gold Price remain volatile amid rising US bond yields

Gold was trading a tad higher in the Indian market on October 20 even as surging US bond yields dented the metal’s appeal in the international market and bets for upbeat corporate earnings lifted risk-on sentiment.
Story first published: Wednesday, October 20, 2021, 10:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X