For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే నెలలో రూ.50,000కు బంగారం ధర! కారణాలివే: కొనుగోలు చేయవచ్చా?

|

బంగారం ధరలు చూస్తుండగానే అలా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. క్రూడాయిల్ ధరలు పతనమయ్యాయి. రూపాయి క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం హెచ్చుతగ్గులు చూస్తోంది. భారీగా పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతోంది.

10 పెద్ద కంపెనీల బ్యాడ్ లోన్లు రూ.34,000 కోట్లు10 పెద్ద కంపెనీల బ్యాడ్ లోన్లు రూ.34,000 కోట్లు

స్వల్పంగా తగ్గుదల

స్వల్పంగా తగ్గుదల

ఇండియాలో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (మార్చి 11) పడిపోయింది. నిన్న ఏప్రిల్ 10న కూడా ఎంసీఎక్స్‌లో ఇది 1.7 శాతం పడిపోయి 10 గ్రాములకు రూ.750 తగ్గింది. వెండి ధర ఫ్యూచర్స్ 1.44 తగ్గి కిలో రూ.46,040గా ఉంది. నేడు ఎంసీఎక్స్‌లో రూ.37 (0.08 శాతం) పడిపోయి రూ.43,703కు చేరుకుంది.

పెరిగిన డిమాండ్

పెరిగిన డిమాండ్

దేశీయ మార్కెట్లో జ్యువెల్లర్ల నుండి, కొనుగోలుదారుల నుండి డిమాండ్ పుంజుకోవడంతో బంగారంపై సానుకూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

రూ.50,000 మార్క్

రూ.50,000 మార్క్

బంగారం త్వరలో రూ.50,000 మార్క్ చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అక్షయ తృతీయ నాటికి అర్ధ సెంచరీకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన అక్షయ తృతీయ ఉంది. అంటే ఈ నెల పదిహేను రోజుల్లో బంగారం ధర రూ.50,000 మార్క్ చేరుకుంటే కొనుగోలుదారులకు మరింత ఇబ్బందే.

ఈ కారణాలతో రూ.50,000

ఈ కారణాలతో రూ.50,000

బంగారం రూ.50,000కు చేరుకోవడానికి వివిధ కారణాలు చూపిస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని, దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారు. వివిధ శుభకార్యాలతో భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1700 డాలర్ల మార్క్ దాటింది. కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తే ఈ ప్రభావం బంగారంపై ఎక్కువగా పడుతుంది.

బంగారం కొనుగోలు చేయవచ్చా..

బంగారం కొనుగోలు చేయవచ్చా..

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బంగారం ధర ఇక భారీగా తగ్గే అవకాశాలు లేవని చెబుతున్నారు. భారీగా పెరుగుతూ స్వల్పంగా మాత్రమే తగ్గుతోందని, ఇక బంగారం రూ.40 వేల నుండి రూ.42వేల మార్క్ దాటినట్లేనని చెబుతున్నారు. అత్యవసరమైతే ఎప్పుడైనా తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. భారీగా తగ్గే అవకాశాలు మాత్రం లేవని అంటున్నారు.

English summary

వచ్చే నెలలో రూ.50,000కు బంగారం ధర! కారణాలివే: కొనుగోలు చేయవచ్చా? | Gold price reach up to rs 50000 per 10 grams till akshaya tritiya

Indian April Gold futures fell from highs on March 11 tracking weakness in international spot Gold prices as expectations of global policy measures to alleviate the economic impact from the coronavirus eased some investors’ concerns.
Story first published: Wednesday, March 11, 2020, 10:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X