For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా షాకిచ్చిన బంగారం ధరలు, ఒక్కరోజే రూ.500 జంప్: రూ.46,000 క్రాస్

|

బంగారం ధరలు నేడు (ఏప్రిల్ 7 బుధవారం) భారీగా పెరిగాయి. చాన్నాళ్లకు రూ.46,000ను క్రాస్ చేశాయి. చాలా వారాల పాటు రూ.45,000కు దిగువనే ఉన్న పసిడి ఫ్యూచర్స్ ఇటీవలే రూ.45వేలు దాటింది. అంతలోనే రూ.46 వేలు కూడా దాటింది. ఈ రెండు మూడు రోజుల్లోనే రూ.1000కి పైగా పెరిగింది. నేడు ఒక్కరోజు రూ.500 ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయినప్పటికీ 1750 డాలర్లకు సమీపంలో ఉన్నాయి. వెండి ధరలు నేడు రూ.668 పెరిగింది.

రూ.457 పెరిగిన బంగారం ధర

రూ.457 పెరిగిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.457.00 (1.00%) పెరిగి రూ.46,376.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,766.00 ప్రారంభమైన ధర, రూ.46,420.00 గరిష్టాన్ని, రూ.45,742.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.477.00 (1.03%) పెరిగి రూ.46625.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,057.00 ప్రారంభమైన ధర, రూ.46,670.00 గరిష్టాన్ని, రూ.46,057.00 కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.668 జంప్

వెండి రూ.668 జంప్

నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు నేడు కూడా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.668.00 (1.01%) పెరిగి రూ.66565.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,690.00 వద్ద ప్రారంభమై, రూ.66,784.00 గరిష్టాన్ని, రూ.65,679.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.748.00 (1.12%) పెరిగి రూ.67580.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,630.00 ప్రారంభమైన ధర, రూ.67,750.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,630.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు తగ్గాయి. 1.25 (0.07%)

డాలర్లు తగ్గి 1,741.75 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,731.20 - 1,745.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 25 డాలర్లకు పైనే ఉంది. 0.004 (0.02%) డాలర్లు తగ్గి 25.223 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.902 - 25.328 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

భారీగా షాకిచ్చిన బంగారం ధరలు, ఒక్కరోజే రూ.500 జంప్: రూ.46,000 క్రాస్ | Gold price gains by Rs 587: silver jumps by Rs 682

Gold rallied by Rs 587 to Rs 45,768 per 10 gram in the national capital on Wednesday amid rupee depreciation.
Story first published: Wednesday, April 7, 2021, 22:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X