For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price: వారంలో రూ.1000 తగ్గిన బంగారం.. మరింత తగ్గుతుందటా..

|

గడిచిన వారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 2.20 శాతం తగ్గింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50,810 ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం 10 నెలల కనిష్టానికి దిగజారడానికి ప్రధాన కారణం గ్లోబల్ ద్రవ్యోల్బణం. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం గోల్డ్ ధర గత వారం ఔన్స్‌కు $1,780 స్థాయిలకు పడిపోయింది. డాలర్ ఇండెక్స్‌లో తీవ్ర పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపుపై యుఎస్ ఫెడ్ నిర్ణయం, ప్రపంచ ద్రవ్యోల్బణం ఆందోళనల వల్ల ధర తగ్గింది.

రూ.48,000 లకు తగ్గుతుందా..
గారం ధరలు ప్రస్తుతం 10 గ్రాములకు రూ.50,400 నుంచి రూ.52,000 అమ్ముతున్నారని మార్కెట్ నిపుణలు తెలిపారు. అయితే విలువైన లోహానికి రూ.48,800 ప్రధాన మద్దతు ధర అని అంచనా వేశారు. రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్‌దేవా మాట్లాడుతూ, "బంగారం ధరలు ఎగుడుదిగుడుగా సాగాయన్నారు. వారంలో అంతర్జాతీయ మార్కెట్‌లలో 10 నెలల కనిష్టానికి పడిపోయాయని చెప్పారు.

Gold price dips over Rs.1000 this week. Is this correction a buying opportunity?

వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. యూఎస్ ఫెడ్ రాబోయే సమావేశంలో మరో భారీ రేటు పెంచే అవకాశం ఉందని రెలిగేర్ నిపుణుడు చెప్పాడు. బంగారం ధర తగ్గడానికి ద్రవ్యోల్బణం కూడా కారణమన్నారు.

Gold price dips over Rs.1000 this week. Is this correction a buying opportunity?

ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌లో పరిశోధన వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ, గత వారం, స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సు స్థాయిలకు $1,780కి పడిపోయిందన్నారు. దేశీయ మార్కెట్లో, MCX బంగారం ధర ₹50,400 నుండి ₹52,000 రేంజ్‌లో ట్రేడవుతోందని చెప్పారు. అయితే దాని రూ.48,800 స్థాయిలో బలమైన మద్దతు ఉంటుందన్నారు.

English summary

Gold Price: వారంలో రూ.1000 తగ్గిన బంగారం.. మరింత తగ్గుతుందటా.. | Gold price dips over Rs.1000 this week. Is this correction a buying opportunity?

After witnessing a bumpy ride throughout the week gone by, gold price on Multi Commodity Exchange (MCX) logged 2.20 per cent weekly loss and ended at ₹50,810 mark on Friday.
Story first published: Saturday, July 9, 2022, 11:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X