For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధర రూ.50,000 దాటే అవకాశం!

|

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు గత వారం మాత్రం అతి స్వల్పంగా 0.20 శాతం క్షీణించాయి. 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం రూ.47,667 వద్ద ముగిసింది. అమెరికా డాలర్ కోలుకోవడంతో పసిడిపై ఒత్తిడి ప్రభావం కనిపించింది. కన్స్యూమర్ ప్రైస్ డేటా గత వారం ఊహించిన దాని కంటే బాగుండటంతో డాలర్ కోలుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) లో గత వారంలోని ఐదు సెషన్లలో బంగారం మూడు సెషన్లలో క్షీణించింది. మొత్తంగా వారంలో రూ.100 వరకు తగ్గింది. అదే సమయంలో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం 11.9 డాలర్లు లేదా 0.65 శాతం పెరిగింది.

Gold outlook: Precious metal on verge of big breakout

బంగారం ధర ఈ వారం కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈసారి రూ.50,000 పైకి చేరుకోవచ్చునని అంచనా. కామెక్స్‌లో 1860 డాలర్ల పైకి చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేం. ఔన్స్ పసిడి మద్దతు ధర 1800 డాలర్లు. బ్రేక్ ఎబోవ్ 1860 డాలర్లు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చివరి సెషన్లో దాదాపు 20 డాలర్లు ఎగిసి 1,843.85 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.239 ఎగిసి రూ.47,677 వద్ద క్లోజ్ అయింది.

English summary

బంగారం ధర రూ.50,000 దాటే అవకాశం! | Gold outlook: Precious metal on verge of big breakout

Gold prices declined by 0.20 percent during the week to settle at Rs 47,667 per 10 gram on choppy trading and firm rupee. The precious metal came under pressure as the US dollar recovered. The dollar recovered last week as a stronger-than-expected consumer prices data stoked inflation concerns that could force Fed to raise interest rates.
Story first published: Sunday, May 16, 2021, 21:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X