For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.48,000 దిగువనే బంగారం ధరలు, ఫెడ్ చైర్ వ్యాఖ్యల ఎఫెక్ట్...

|

యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్ జెరోమ్ పోవెల్ వ్యాఖ్యల అనంతరం బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్లో స్వల్పంగా పెరిగినప్పటికీ, దాదాపు నెల రోజుల కనిష్టం వద్ద ఉన్నాయి. బాండ్ పర్చేస్ ముగింపుపై త్వరలో కేంద్ర బ్యాంకు డిస్కస్ చేస్తుందని జెరోమ్ ప్రకటించడం పసిడి ధరలపై ప్రభావం చూపింది. దీంతో నిన్న కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1780 డాలర్ల దిగువకు పడిపోయాయి. అయితే నేడు కాస్త పుంజుకున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం రూ.48,000కు దిగువన, సిల్వర్ రూ.62,000 దిగువన ఉంది.

బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి(డిసెంబర్ 1) ఉదయం సెషన్‌లో రూ.47,650 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,772 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.60 శాతం లాభపడి 1780 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,773.65 - 1,781.90 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,776.50 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో బంగారం ధరలు 0.74 శాతం తగ్గాయి.

డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.61,725 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,299 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 22.872 వద్ద ట్రేడ్ అయింది.

నిన్నటి విషయానికి వస్తే... ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.63 పెరిగి రూ.47,650 వద్ద, అంతర్జాతీయ మార్కెట్లో 1776 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో రూ.61,670 వద్ద, అంతర్జాతీయ మార్కెట్లో 23 డాలర్ల దిగువన ముగిసింది.

మద్దతు ధర, నిరోధకస్థాయి

మద్దతు ధర, నిరోధకస్థాయి

ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47700-47500. నిరోధకస్థాయి రూ.48050-48300. వెండి ధర మద్దతు రూ.62000-61500. నిరోధకస్థాయి రూ.62700-63300. బంగారాన్ని రూ.47,500 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.48,200 టార్గెట్ ధరతో రూ.47,700 వద్ద కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1760-1750 డాలర్లు. నిరోధకస్థాయి 1790-1800 డాలర్లు. సిల్వర్ మద్దతు ధర 22.55-22.20 డాలర్లు. నిరోధకస్థాయి 23-23.50 డాలర్లు.

ఆర్థిక రికవరీ మందగమనం

ఆర్థిక రికవరీ మందగమనం

కేంద్ర బ్యాంకు అంచనాలు 2 శాతానికి మించి అమెరికాలో ద్రవ్యోల్భణం ఉండటం పట్ల ఫెడ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బ్యాంకు ముందు ద్రవ్యోల్భణాన్ని తగ్గించడమనే అతిపెద్ద సవాల్ ఉందని ఫెడ్ వైస్ చైర్ రిచర్డ్ క్లారిడా అన్నారు.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కరోనా వైరస్ వినియోగదారు సెంటిమెంటును బలహీనపరుస్తోందని, దీంతో ఆర్థిక రికవరీ మందగిస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ మేకర్ కాథెరీన్ మన్ అన్నారు. ఇప్పటికే పలు దేశాల మధ్య ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది రికవరీపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పైన, బులియన్ మార్కెట్ పైన ఉంటుంది.

English summary

రూ.48,000 దిగువనే బంగారం ధరలు, ఫెడ్ చైర్ వ్యాఖ్యల ఎఫెక్ట్... | Gold hovers near 1 month low, Yellow metal below Rs 48,000

Gold edged higher on Wednesday, hovering close to a one-month low, after the U.S. Federal Reserve Chair Jerome Powell said the central bank would discuss ending its bond purchases sooner.
Story first published: Wednesday, December 1, 2021, 10:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X