For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జనవరి 15 నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి

|

బంగారు ఆభరణాలకు జనవరి 15, 2020 నుంచి హాల్ మార్కింగ్ తప్పనిసరి. హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయడం వల్ల కస్టమర్లకు భరోసా లభించినట్లు అవుతుంది. 2001లో హాల్ మార్క్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కొందరు వ్యాపారులు లేదా కొన్ని వ్యాపార సంస్థలు మాత్రమే దీనిని స్వచ్చంధంగా పాటిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేయడంతో వ్యాపారులకు జవాబుదారీతనం వస్తుందని అంటున్నారు.

 జనవరి 15 నుంచి హాల్‌మార్క్ లేదంటే భారీ జరిమానా, జైలు శిక్ష: రూ.50 మాత్రమే ఛార్జ్ జనవరి 15 నుంచి హాల్‌మార్క్ లేదంటే భారీ జరిమానా, జైలు శిక్ష: రూ.50 మాత్రమే ఛార్జ్

మోసపూరితంగా, కొనుగోలుదార్లను వేధించేలా వ్యవహరించే వారి ఆటలు సాగవని చెబుతున్నారు. హాల్ మార్క్ విధానంతో తగిన హామీతో నాణ్యత కలిగిన ఆభరణాలే విక్రయించాల్సి వస్తుంది. కాబట్టి పరిశ్రమపై నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

 Gold Hallmarking Process To Begin Tomorrow

అయితే హాల్ మార్కింగ్ సెంటర్లు సరైన పద్ధతులు పాటించేలా, ఆభరణాల పరీక్షలో గ్రేడ్‌లు, ప్రమాణాలు దేశవ్యాప్తంగా ఒకేరకంగా ఉండేలా ప్రభుత్వం పర్యవేక్షించాల్సిన అవసరముందని ఈ రంగంలోని వారు అభిప్రాయపడుతున్నారు. హాల్ మార్క్ సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం దేశంలో దాదాపు తొమ్మిది వందల హాల్ మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. హాల్ మార్కింగ్ చేసిన ఆభరణాల వ్యవస్థను డిజిటల్ వ్యవస్థ ద్వారా పరిశీలిస్తే అనధికారిక ట్రాన్సాక్షన్లను కూడా అరికట్టవచ్చు.

English summary

జనవరి 15 నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి | Gold Hallmarking Process To Begin Tomorrow

Mandatory hallmarking process of gold jewellery and artefacts will begin from tomorrow, Ministry of Consumer Affairs said in a press release. The mandatory hallmarking of gold jewellery has to be completed by January 15, 2021.
Story first published: Tuesday, January 14, 2020, 19:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X