అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమని, ఈ ప్రక్రియ సాగుతోందని ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే, కరోనా వ్యాక్సీన్ పైన ఎప్పటికప్పుడు ప్రకటనలు సానుకూలంగా వస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు జంప్ చేశాయి. మంగళవారం మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ప్రధానంగా అధ్యక్ష బాధ్యతల మార్పు సాఫీగా సాగుతుందని ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లకు ఊతమిచ్చాయి.

డౌజోన్స్ సరికొత్త రికార్డు
అమెరికా సూచీ డౌజోన్స్ ఏకంగా 1.54 శాతం లేదా 455 పాయింట్లు ఎగిసి 30,046.24 పాయింట్ వద్ద ముగిసింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావేరేజ్ మొదటిసారి 30వేల మార్కును క్రాస్ చేసింది. ట్రంప్ ప్రకటన, వ్యాక్సీన్ ప్రకటనలకు తోడు కరోనా కారణంగా ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థలు పతనమైనప్పటికీ, ఇప్పటికే కోలుకుంటున్నాయని, వచ్చే ఏడాది పుంజుకుంటాయని పలు ఏజెన్సీలు చెప్పడం కూడా దోహదపడింది.
నాస్‌డాక్ 12 వేల మార్కును దాటింది. 1.31 శాతం లేదా 156 పాయింట్లు లాభపడి 12,036 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఎస్ అండ్ పీ 1.62 శాతం లేదా 58 పాయింట్లు లాభపడి 3,635 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

అస్ట్రాజెనికా వ్యాక్సీన్
తమ వ్యాక్సీన్ 95 శాతం ఫలితాలు ఇస్తోందని ఫైజర్, మోడర్నా ఇటీవల ప్రకటించాయి. అస్ట్రాజెనికా వ్యాక్సీన్ ప్రకటన కూడా ఈక్విటీ మార్కెట్లకు కొత్త ఊపు ఇచ్చింది. అస్ట్రాజెనికా ప్రభావం చమురు మార్కెట్ పైన కూడా కనిపిస్తోంది. ఈ వ్యాక్సీన్ వస్తే డిమాండ్ పుంజుకుంటుందని భావిస్తున్నారు. మార్చి తర్వాత చమురు ధరలు గరిష్టానికి చేరుకున్నాయి.

చమురు ధరలు జంప్
వ్యాక్సీన్ ప్రకటన నేపథ్యంలో చమురు ధరలు పుంజుకున్నాయి. 2021లో రికవరీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్ ధర దాదాపు 2 శాతం లాభపడి 45 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 1.67 శాతం ఎగిసి 47 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నైమెక్స్ నేచరల్ గ్యాస్ 0.046 శాతం ఎగిసింది. చమురు ధరలు తొలిసారి ఎనిమిది నెలల గరిష్టాన్ని తాకాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications