ముంబై: ఈ ఏడాది భారత కుబేరుల్లో అత్యంత ఎక్కువ సంపాదన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీది. ఈ ఏడాది సంపద సృష్టిలో ఆయన ఏకంగా ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ సూచీ ప్రకారం గౌతమ్ అదానీ సంపద 19.1 బిలియన్ డాలర్లు పెరిగింది. ముఖేష్ అంబానీ రాబడి 16.4 బిలియన్ డాలర్ల కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. భారత కరెన్సీ రూపాయల్లో 2020లో ఈ పదిన్నర నెలల కాలంలో అదానీ రూ.1.41 లక్షల కోట్లు ఆర్జించారు. కరోనా నేపథ్యంలో కొన్ని రంగాలు భారీగా పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది బిజినెస్‌మెన్ భారీగా సంపాదించారు.

అదానీ ఆదాయం రోజుకు రూ.449 కోట్లు
2020 జనవరి నుండి నవంబర్ మిడిల్ నాటికి అంటే పదిన్నర నెలల్లో మొత్తం రూ.1.41 లక్షల కోట్లు అంటే.. అదానీ ఆదాయం రోజుకు రూ.449 కోట్లు. అదానీ... భారత్‌లో ఈ ఏడాది సంపాదనలో ముఖేష్ అంబానీని దాటడమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కాలంలో భారీగా ఆర్జించిన టాప్ 10లో తొమ్మిదో స్థానంలో నిలిచారు. స్టీవ్ బాల్మర్, లారీ ఫేజ్, బిల్ గేట్స్ తదితరుల సరసన నిలిచారు. అదానీ సంపద మొత్తం 30.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో నలభయ్యవ స్థానంలో నిలిచారు.

ఏ స్టాక్ ఎంత పెరిగిందంటే
అదానీ గ్రీన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్స్ ఈ ఏడాది భారీగా పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, స్టాక్స్ 551 శాతం పెరిగాయి. అదానీ గ్యాస్ స్టాక్స్ 103 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 85 శాతం ఎగిశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ 38 శాతం, అదానీ పోర్ట్స్ 4 శాతం, అదానీ పవర్ 38 శాతం ఎగిశాయి. 1988లో తన 32 ఏళ్ల వయస్సులో గౌతమ్ అధానీ కమొడిటీ ట్రేడర్‌గా ప్రారంభించి ఇప్పుడు పోర్ట్స్, ఎయిర్ పోర్ట్స్, ఎనర్జీ, రిసోర్సెస్, లాజిస్టిక్స్, అగ్రిబిజినెస్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, డిఫెన్స్ బిజినెస్ తదితర వ్యాపారాల్లో ఉన్నారు.

10వ స్థానంలో ముఖేష్ అంబానీ
ఇక, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద ఈ పదిన్నర నెలల కాలంలో 16.4 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద 75 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో అతను 10వ స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయంగా చూస్తే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 92 బిలియన్ డాలర్ల నుండి 120 బిలియన్ డాలర్లకు పెరిగింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆదాయం 68 బిలియన్ డాలర్లు, ఝోంగ్ షాన్షన్ 68 బిలియన్ డాలర్లకు పెరిగింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications