For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: 2012 తర్వాత అత్యంత బలహీనంగా భారత వృద్ధిరేటు

|

కరోనా మహమ్మారి కారణంగా భారత వృద్ధి రేటుపై భారీ ప్రభావం పడనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోనుంది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. గత ఏడాది మందగమనం కారణంగా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత కరోనా - లాక్ డౌన్ కారణంగా భారీగా దెబ్బతిన్నది.

దెబ్బ మీద దెబ్బ, ఆర్థిక సవాళ్ళు: ఒక డాలర్‌కే అతిపెద్ద మీడియా హౌస్ అమ్మకందెబ్బ మీద దెబ్బ, ఆర్థిక సవాళ్ళు: ఒక డాలర్‌కే అతిపెద్ద మీడియా హౌస్ అమ్మకం

భారీగా పడిపోయిన వృద్ధి రేటు

భారీగా పడిపోయిన వృద్ధి రేటు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో కార్యకలాపాలు బాగానే ఉన్నాయని, కానీ ఆ తర్వాత కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రభావం పడిందని హెచ్ఎస్‌బీసీ ఎకనమిస్ట్ ఆయుష్ చౌదరి అన్నారు. మే 20 నుండి 25 మధ్య పోల్ ద్వారా 52 ఆర్థికవేత్తల నుండి తీసుకున్న అభిప్రాయం ప్రకారం మార్చిలో వృద్ధి రేటు 2.1 శాతంగా ఉంది. ఇది 2012 నుండి అత్యంత బలహీన వృద్ధి కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు మూడు త్రైమాసికాల 4.7 శాతం వృద్ధి రేటు కంటే పడిపోయిందని వెల్లడించారు.

లాక్ డౌన్ తర్వాత..

లాక్ డౌన్ తర్వాత..

జీడీపీ వృద్ధి రేటు అంచనాకు సంబంధించిన డేటా మే 29న విడుదల కానుంది. ఇది 4.5 శాతం నుండి మైనస్ 1.5 శాతం మధ్య ఉండవచ్చునని అంచనా. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పోల్‌లో పాల్గొన్న ఆరుగురు ఆర్థికవేత్తలు జీడీపీ తగ్గుతుందని చెబుతున్నారు. ఇప్పటికే పలు సూచీలు జనవరి - మార్చి జీడీపీపై గణనీయ ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు. మార్చి చివరలో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత గత ఆర్థిక వ్యవస్థ కుదించికుపోతుందని భావిస్తున్నట్లు సింగపూర్ క్యాపిటల్ ఎకనమిక్స్‌కు చెందిన ఇండియా సీనియర్ ఎకనమిస్ట్ షిలాన్ షా అన్నారు.

నాలుగు దశాబ్దాల భారీగా కుంచించుకుపోతుంది

నాలుగు దశాబ్దాల భారీగా కుంచించుకుపోతుంది

కరోనా వల్ల సుదీర్ఘ ఆంక్షలతో పాటు పరిమిత ప్యాకేజీ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు దశాబ్దాల తర్వాత భారీగా కుంచించుకుపోనుందని షిలాన్ షా చెప్పారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై ఈ పోల్‌లో పాల్గొన్న కొందరు ఆర్థికవేత్తలు స్పందిస్తూ.. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారని, ఇది క్రెడిట్ లభ్యతను పెంచేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ప్యాకేజీ సమీప కాలంలో డిమాండ్‌ను పూరించే కంటే దీర్ఘకాలంలో బాగా ఉపయోగపడుతుందని పాంథియోన్ మ్యాక్రో ఎకనమిక్స్ చీప్ ఏసియా ఎకనమిస్ట్ ప్రెయా బీమిష్ అన్నారు. మే చివరి వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తోందన్నారు.

English summary

COVID 19: 2012 తర్వాత అత్యంత బలహీనంగా భారత వృద్ధిరేటు | First quarter GDP growth likely to be weakest since 2012

India's economy is likely to have expanded at its slowest pace in at least eight years in the January-March quarter, partly as a result of the coronavirus clampdown.
Story first published: Tuesday, May 26, 2020, 14:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X