For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GDP: వృద్ధి రేటు 5 శాతమే, 11 ఏళ్ళ కనిష్టానికి అంచనాలు

|

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020)లో దేశ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్టస్థాయి అయిన 5 శాతానికి చేరవచ్చునని జాతీయ గణాంక కార్యాలయం తన తొలి అడ్వాన్స్ ఎస్టిమేషన్‌లో వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నెలకొన్న 2008-09 సమయంలో జీడీపీ వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదైంది.

2018-19లో వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదైన ఈ ఏడాది పారిశ్రామికవృద్ధి కుంటుపడటంతో వృద్ధి డీలా పడింది. మంగళవారం వచ్చిన గణాంకాల ప్రకారం వాస్తవ స్థూల విలువ జోడింపులో వృద్ధి 4.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా. 2018-19లో ఇది 6.6 శాతంగా ఉంది.

 First advance GDP estimates for 2019-20

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ మంగళవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు క్వార్టర్లలో జీడీపీ రేటు వరుసగా 5 శాతానికి, 4.5 శాతానికి తగ్గింది. దీంతో అడ్వాన్స్ ఎస్టిమేషన్ పైన అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్‌కు మొదటి తొమ్మిది నెలల కాలంలోని అంటే ఏప్రిల్ - డిసెంబర్ మధ్య గణాంకాలను పరిగణలోకి తీసుకుంటారు.

భారత వృద్ధి రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు వివిధ రేటింగ్ ఏజెన్సీలు కూడా క్రమంగా తగ్గించాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో క్రమంగా దిగజారింది. మొదటి ఆరు నెలల కాలానికి జీడీపీ 4.8 శాతం వద్ద నిలిచింది.

ఆర్థిక మందగమనాన్ని తగ్గించి, వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నో ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించింది. బడ్జెట్ కూడా ఆ దిశగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీడీపీ అడ్వాన్స్ ఎస్టిమేషన్ వైపు అందరూ చూశారు.

English summary

GDP: వృద్ధి రేటు 5 శాతమే, 11 ఏళ్ళ కనిష్టానికి అంచనాలు | First advance GDP estimates for 2019-20

The first Advance Estimates of GDP numbers for 2019-20, which would be released on Tuesday, may not be closer to reality if the strike rate of the last two years is any indication.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X