For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2015 తర్వాత తొలిసారి..: మార్కెట్‌ను ఒంటిచేత్తో లేపిన బ్యాంక్, దెబ్బతీసిన ఐటీ స్టాక్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(అక్టోబర్ 14) లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రానికి లాభాల్లోకి వచ్చాయి. కేవలం ఫైనాన్షియల్ స్టాక్స్ మార్కెట్‌ను పైకి లాగాయి. నష్టాల్లో ముగుస్తుందని భావించిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధానంగా బ్యాంకింగ్ షేర్ల వల్ల ఊహించని విధంగా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 169.23 పాయింట్లు(0.42%) లాభపడి 40,794.74 వద్ద, నిఫ్టీ 36.50 పాయింట్లు(0.31%) ఎగిసి 11,971 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

1,202కు పైగా షేర్లు లాభాల్లో, 1439 షేర్లు నష్టాల్లో ముగియగా, 160 షేర్లలో మార్పులేదు. బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు లాభాలు నమోదు చేశాయి. ఇతర రంగాలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ దెబ్బతీశాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ స్వల్ప నష్టాల్లో, మిడ్ క్యాప్ స్వల్ప లాభాల్లో ముగిశాయి.

2020లో దారుణ ఆర్థిక పతనం, వచ్చే ఏడాది చైనాను దాటనున్న భారత్2020లో దారుణ ఆర్థిక పతనం, వచ్చే ఏడాది చైనాను దాటనున్న భారత్

2015 తర్వాత మొదటిసారి...

2015 తర్వాత మొదటిసారి...

భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత ఫైనాన్షియల్ అండతో లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు వరుసగా 10వ రోజు లాభాలు చూశాయి.

నిఫ్టీ 50 సూచీ నేటి కనిష్టం నుండి క్లోజింగ్ సమయానికి 150 పాయింట్లు లాభపడింది. ఓ సమయంలో 11,822 పాయింట్లకు పడిపోయిన నిఫ్టీ 11,971 వద్ద క్లోజ్ అయింది.

నిఫ్టీ ఫైనాన్షియల్ 1.79 శాతం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ ఒక్కొక్కటి ఒక శాతానికి పైగా లాభపడింది.

చివరి గంటలో మార్కెట్ భారీ లాభాలను చూసింది. దీంతో వరుసగా పదో రోజు లాభాల్లో ముగిసింది.

2015 జనవరి తర్వాత మొదటిసారి సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మంచి లాభాలు చూశాయి.

నిఫ్టీ బ్యాంకు 382 పాయింట్లు లాభపడి 23,875 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ 27 పాయింట్లు నష్టపోయి 16,886 పాయింట్ల వద్ద ముగిసింది.

పైకి లాగిన ఫైనాన్షియల్ కిందకు లాగిన ఐటీ

పైకి లాగిన ఫైనాన్షియల్ కిందకు లాగిన ఐటీ

నేటి మార్కెట్‌ను ఫైనాన్షియల్ స్టాక్స్ పైకి లాగాయి. అదే సమయంలో ఐటీ స్టాక్స్ కిందకు లాగాయి.

ICICI బ్యాంకు, HDFC బ్యాంకు, HDFC స్టాక్స్ అదరగొట్టాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా మోటార్స్ ఉన్నాయి.

నేటి యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.

నిఫ్టీలో టాప్ లూజర్స్ జాబితాలో విప్రో ముందు ఉంది.

ప్రజ్ ఇండస్ట్రీస్ 5 శాతం మేర లాభపడ్డాయి.

బ్యాంకింగ్ ఇలా.. ఐటీ అలా

బ్యాంకింగ్ ఇలా.. ఐటీ అలా

నిఫ్టీ బ్యాంకు 1.63 శాతం లాభపడింది. నిఫ్టీ ఫిన్ సర్వ్ 1.79 శాతం ఎగిసింది.

నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.11 శాతం, నిఫ్టీ మీడియా 0.24 శాతం, నిఫ్టీ మెటల్ 0.10 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.99 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.48 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.06 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 0.27 శాతం, నిఫ్టీ ఫార్మా 0.67 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఏకంగా 1.28 శాతం నష్టపోయింది.

టీసీఎస్ షేర్ 0.59 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.49 శాతం, ఇన్ఫోసిస్ 1.71 శాతం, టెక్ మహీంద్ర 2.33 శాతం, మైండ్ ట్రీ 2.66 శాతం నష్టపోయాయి. విప్రో ఏకంగా 7.06 శాతం, కోఫోర్జ్ 6.99 శాతం మేర కోల్పోయాయి.

HDFC బ్యాంక్ షేర్ 1.26 శాతం, HDFC షేర్ 1.79 శాతం, ఐసీఐసీఐ షేర్ 2.66 శాతం, యాక్సిస్ బ్యాంకు షేర్ 2.31 శాతం, కొటక్ మహీంద్ర బ్యాంకు షేర్ 0.75 శాతం లాభపడ్డాయి. ఫైనాన్షియల్ రంగంలోని దాదాపు అన్ని స్టాక్స్ మంచి లాభాలు నమోదు చేయడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఎగిశాయి.

English summary

2015 తర్వాత తొలిసారి..: మార్కెట్‌ను ఒంటిచేత్తో లేపిన బ్యాంక్, దెబ్బతీసిన ఐటీ స్టాక్స్ | Financials single handedly take Sensex, Nifty higher for 10th straight session

Among sectors, except bank, FMCG and metal other indices ended in the red. BSE Smallcap Index ended marginally lower and Midcap index gained 0.5 percent.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X