For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ అదరగొట్టాయి: రిలయన్స్ భారీ పతనం, రూ.1900 దిగువకు!

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(నవంబర్ 20) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు మధ్యలో కాస్త నష్టాల్లోకి వెళ్లినప్పటికీ అంతకుమించి ఎగిశాయి. ఉదయం సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 39 పాయింట్లు లాభంతో ప్రారంభమైంది. ఉదయం గం.11 సమయానికి 43,830 పాయింట్లను తాకినప్పటికీ, కాసేపటికే నిన్నటి ముగింపు 43,600 కంటే దిగువకు చేరుకొని, 43,480 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం చివరి గంటలో కొనుగోళ్లు పెరిగి భారీ లాభాలు నమోదు చేశాయి. ఓ సమయంలో 44 వేల మార్క్ సమీపానికి చేరుకొని, చివరకు 282 పాయింట్ల లాభంతో ముగిసింది.

<strong>గూగుల్, ఫేస్‌బుక్ ఎఫెక్ట్: భారత్‌కు అమెరికా డిజిటల్ ట్యాక్స్ షాక్!</strong>గూగుల్, ఫేస్‌బుక్ ఎఫెక్ట్: భారత్‌కు అమెరికా డిజిటల్ ట్యాక్స్ షాక్!

రిలయన్స్ స్టాక్ భారీ పతనం

రిలయన్స్ స్టాక్ భారీ పతనం

ఈ రోజు నిఫ్టీ 87.30 పాయింట్లు(0.68 శాతం) లాభపడి 12,859 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 282.29 పాయింట్లు(0.65%) ఎగిసి 43,882.25 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎగిశాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ 9.19 శాతం, టైటాన్ కంపెనీ 5.62 శాతం, గెయిల్ 4.06 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.95 శాతం, కొటక్ మహీంద్ర 3.45 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్ 3.73 శాతం, అదానీ పోర్ట్స 1.58 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.86 శాతం, సన్ ఫార్మా 0.81 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.78 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ భారీగా పతనమైంది. ఏకంగా రూ.1900 దిగువకు చేరుకుంది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 3.66 శాతం లేదా రూ.72 పడిపోయి రూ.1901 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.65 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.15 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.05 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.70 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.19 శాతం, నిఫ్టీ ఐటీ 1.40 శాతం, నిఫ్టీ మెటల్ 0.80 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.52 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.84 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ మీడియా 0.92 శాతం, నిఫ్టీ ఫార్మా 0.34 శాతం నష్టపోయాయి.

బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ రంగాలు ఎగిశాయి. ఫార్మా, మీడియా మాత్రమే నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి.

బజాజ్ ఫిన్ సర్వ్ 9 శాతం, టైటాన్ 5 శాతం మేర లాభపడటం గమనార్హం.

సెన్సెక్స్ 30లో 21 స్టాక్స్ లాభపడ్డాయి.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు స్టాక్స్ నేడు మరో 10 శాతం పడిపోయి రూ.9కి క్షీణించాయి. వరుసగా రెండు రోజులు 20 శాతం చొప్పున మొత్తం 40 శాతం, నేడు 10 శాతం తగ్గాయి.

ఐటీ స్టాక్స్ అదుర్స్

ఐటీ స్టాక్స్ అదుర్స్

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 0.79 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.92 శాతం, ఇన్ఫోసిస్ 0.70 శాతం, టెక్ మహీంద్ర 1.83 శాతం, విప్రో 1.28 శాతం, మైండ్ ట్రీ 3.01 శాతం, కోఫోర్జ్ 0.97 శాతం లాభపడ్డాయి. యూఎస్ ట్రెజరీ అత్యవసర రుణ కార్యక్రమాలను ముగించినట్లు వార్తలు రావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం నిలిచిపోయాయి.

English summary

ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ అదరగొట్టాయి: రిలయన్స్ భారీ పతనం, రూ.1900 దిగువకు! | Financials lift indices: Sensex rebounds 282 points, Nifty ends above 12,850

The Nifty50 closed at 12,859, up 87.30 points and the BSE Sensex jumped 282.29 points to 43,882.25, driven by banking & financials, FMCG and IT stocks.
Story first published: Friday, November 20, 2020, 17:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X