For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Loan Rejection: ఎన్ని సార్లు లోన్ కోసం అప్లై చేసినా రిజెక్ట్ అవుతుందా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే

|

Loan Rejection: ఈ రోజుల్లో చాలా ఫిన్ టెక్ కంపెనీలు లోన్స్ అందిస్తున్నాయి. కానీ.. చాలా మందికి ఎన్ని సంస్థల్లో లోన్ కోసం ప్రయత్నించినా నిరాశే ఎదురవుతుంటుంది. అలా ఎందుకు జరుగుతుంటుందో వారికీ తెలియక పోవచ్చు. ఇలా రుణాలు రాకపోవటం వెనుక పెద్ద కథే ఉంది. ముందుగా.. రిస్క్ మేనేజర్లు చెడ్డ అప్పుల నుంచి సంస్థలను రక్షించటంలో భాగంగా అనేక మంది లోన్ అప్లికేషన్లను తిరస్కరిస్తుంటారు. వారు పాటింటే కొన్ని నియమాల ప్రకారం లోన్ ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తారని మనం గమనించాలి. అసలు కంపెనీలు ఏఏ కారణాల వల్ల లోన్ అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 ఉద్యోగం, నెలవారీ ఆదాయం..

ఉద్యోగం, నెలవారీ ఆదాయం..

స్థిరమైన ఉద్యోగంలో ఉండటం లోన్ రీపేమెంట్ నిబంధనలకు చాలా ముఖ్యమైనది. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తన కెరీర్, ఫైనాన్సియల్స్ కు సంబంధించిన అనేక వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. వీటి ద్వారా సదరు వ్యక్తి క్రెడిట్ స్కోర్ ను రుణం అందించే కంపెనీలు లెక్కిస్తాయి. కాబట్టి లోన్ విషయంలో.. ఉద్యోగం, ఆదాయం చాలా ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోండి.

 మునుపటి డేటా..

మునుపటి డేటా..

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు లోన్ అప్లికెంట్ సాంప్రదాయ సమాచారాన్ని పరిగణించవు. కానీ బ్యాంకులు పరిగణించవచ్చు. మీ క్రెడిట్ హిస్టరీని వదిలించుకోవడం చాలా కష్టం. ప్రత్యేకించి మీరు ఎప్పుడైనా దివాలా తీసినట్లయితే ఆర్థిక సంస్థల బ్యాడ్ బుక్స్ లో ఉండటం లోన్ విషయంలో చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి సమయానికి చెల్లింపులు చేయటం చాలా ముఖ్యం.

తరచుగా రుణాలు తీసుకుంటున్నట్లయితే..

తరచుగా రుణాలు తీసుకుంటున్నట్లయితే..

మీరు ఒకే సమయంలో లోన్ కోసం చాలా బ్యాంకులను ఎంక్వైరీ చేస్తే.. ఏ కారణంగానైనా ఒక సంస్థ రిజెక్ట్ చేసినా మిగిలిన దరఖాస్తులు కూడా తిరస్కరింపబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోర్ ను దెబ్బతీస్తుందని గుర్తుంచుకోండి. ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో లోన్స్ ఉన్నా, క్రెడిట్ కార్డ్ రుణాలు ఉన్నట్లయితే మీరు లోన్స్ వచ్చే చాన్స్ తగ్గుతుంది.

 బ్యాంకుల రూల్స్..

బ్యాంకుల రూల్స్..

మీ విశ్వసనీయతలో తప్పు ఏమీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ.. మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట వ్యవధిలో బ్యాంక్ పోర్ట్‌ఫోలియో లోన్ ఆంక్షల పరిమితిని మించిపోయినట్లయితే లోన్ రిజెక్ట్ చేయబడుతుంది. బ్యాంకులు కూడా డిఫాల్టర్ హిస్టరీ కోసం ఇతర ఆర్థిక సంస్థల నుంచి వివరాలను అడగవచ్చని నిపుణులు అంటున్నారు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

CIBIL రిపోర్ట్..

CIBIL రిపోర్ట్..

లోన్ విషయంలో సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యమైనది. దీని వల్లనే మీకు లోన్ ఇవ్వాలా వద్దా అని ఫైనాన్స్ కంపెనీలు నిర్ధారిస్తాయి. ఇది బాగున్నట్లయితే తక్కువ వడ్డీకే లోన్ ముంజూరయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు రుణాలు, ఈఎంఐలను సకాలంలో చెల్లించకపోతే ఇది కచ్చితంగా దెబ్బతింటుంది. ఇది మీపై విస్వసనీయతను తగ్గింస్తుందని గుర్తుంచుకోవాల్సిన విషయం.

 కీలకమైన రేషియోలు..

కీలకమైన రేషియోలు..

మీ ఆస్తులు చాలా వరకు తాకట్టు పెట్టబడినా లేదా తనఖా పెట్టబడినా.. అది మీ రుణభారాన్ని చూపుతుంది. బ్యాంకు దాని భద్రత కోసం మీ ఆస్తిని పొందలేకపోతే మీకు లోన్ మంజూరు చేయడం కష్టం. మిగతావన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ.. మీ సెక్యూర్డ్-టు-సెక్యూర్డ్ రేషియో మీ రుణానికి హామీ ఇవ్వడానికి అనుకూలంగా ఉండాలి. ఇంకా.. లోన్ అప్లికెంట్ EMI నుంచి ఆదాయ నిష్పత్తి గురించి తెలుసుకోవాలి. ఇది రుణ దరఖాస్తును అంచనా వేయడానికి చాలా కీలకమైనది.

 క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలంటే..

క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలంటే..

బ్యాంకులు రుణాల పంపిణీకి సంబంధించి కఠినమైన మార్గదర్శకాలను కలిగి ఉన్నాయి. మీరు మీ ఆర్థిక నిర్వహణలో శ్రద్ధగా ఉంటేనే లోన్స్ సులువుగా రావటానికి సహాయపడుతుంది. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ బిల్లులలో క్రెడిట్ స్కోర్లను చేర్చడం ప్రారంభించాయి. కాబట్టి క్రెడిట్ స్కోర్ తగ్గుదలను నిర్లక్ష్యం చేయకండి. కనీసం 750 పాయింట్ల కంటే ఎక్కువ స్కోర్ ఉన్నట్లయితే మీరు త్వరగా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్, లోన్ దరఖాస్తుల వివరాలు, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలు బ్యాంకులకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.. కాబట్టి వాటి ఆధారంగా లోన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవటం ఆర్థికంగా చాలా ముఖ్యమైన అంశం.

English summary

Loan Rejection: ఎన్ని సార్లు లోన్ కోసం అప్లై చేసినా రిజెక్ట్ అవుతుందా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే | facing repeated rejection of loans know about these key factors that may cause you rejection of loans

know about factors that may causing you repeated loans rejection from financial institutions
Story first published: Friday, June 24, 2022, 17:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X