For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్‌బుక్‌లో ఇకపై అధికారిక మ్యూజిక్ వీడియోస్! ఇండియాలో ప్రారంభం

|

ఫేస్ బుక్ మారుతోంది. యూజర్ల అభిరుచులకు తగ్గట్లు కొత్త తరహా సేవలు అందించటంలో ఫేస్బుక్ ఎప్పుడూ ముందు ఉంటుంది. తాజాగా అలాంటిదే ఒక సరికొత్త మార్పును యూజర్లకు పరిచయం చేస్తోంది. ఇకపై అధికారిక మ్యూజిక్ వీడియో లను ఫేస్బుక్ లో అందించనుంది. ఈ సేవలను అమెరికా సహా ఇండియా లో కూడా ఫేస్బుక్ ప్రారంభించింది. ఇందుకోసం టి-సిరీస్, జీ మ్యూజిక్, యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి కంపెనీలు ఫేస్బుక్ తో కలిసి పనిచేయబోతున్నాయి. దీంతో ఫేస్బుక్ యూజర్ల కు సరికొత్త అనుభూతి లభించనుంది. ఏడాది కాలంగా ఇలాంటి సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, మొత్తానికి ఇప్పుడు సాధ్యమయింది అని ఫేస్బుక్ ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ పార్టనర్ షిప్స్ మనీష్ చోప్రా వెల్లడించారు. ఫేస్బుక్ ప్లాట్ఫారం పై సరికొత్త మ్యూజిక్ వీడియో అనుభూతిని మా వినియోగదారులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

చైనా సహా ఆ దేశాలకు ఇండియా షాక్, కలర్ టీవీల దిగుమతులపై కఠిన ఆంక్షలు

పాటలు మాత్రమే కాదు...

పాటలు మాత్రమే కాదు...

ఫేస్బుక్ అందిస్తున్న సరికొత్త మ్యూజిక్ వీడియో లు కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాబోవటం లేదు. ఆర్టిస్టులు, వారికి సంబంధించిన అనేక విషయాలను కూడా వినియోగదారులు తెలుసుకునే అవకాశం కల్పిస్తారు. అది కూడా ఫేస్బుక్ పేజీ నుంచి బయటకు వెళ్లకుండానే సమస్త సమాచారం అక్కడ లభిస్తుంది. దీనిని సోషల్ షేరింగ్ ద్వారా మిత్రులతో పంచుకోవచ్చు. న్యూస్ ఫీడ్ లో భాగంగా వీక్షించవచ్చు. ఫేస్బుక్ వాచ్ అనే సరికొత్త ఆప్షన్ ద్వారా కూడా అధికారిక మ్యూజిక్ వీడియో లు వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎప్పటికప్పుడు మారకపోతే మనుగడ కష్టమవుతుంది. ఇప్పుడు అంతా వీడియో కంటెంట్ కే ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకే ఈ సెగ్మెంట్ ను బలోపేతం చేయటం ఫేస్బుక్ కు తప్పనిసరి ఐంది.

యూట్యూబ్ తో పోటీ...

యూట్యూబ్ తో పోటీ...

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ వీడియో ప్లేట్ ఫారం యూట్యూబ్. అందులో దొరకని వీడియో అంటూ లేదు. దీంతో గూగుల్ తర్వాత ఎక్కువ మంది సెర్చ్ చేసేది యూట్యూబ్ నే. అయితే యూట్యూబ్ కూడా గూగుల్ సొంత సంస్థ. కాబట్టి, దానికి పోటీ ఇప్పట్లో లేదు. ఫేస్బుక్ కు తొలినాళ్లలో విపరీతమైన ఆదరణ లభించినా ... ప్రస్తుతం ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్ఫారం లకు డిమాండ్ పెరిగిపోయింది. అందుకే, ఫేస్బుక్ లో సరికొత్త ఎక్స్పీరియన్సెస్ లేకపోతే క్రమంగా యూజర్లు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి, యూట్యూబ్ తరహాలో ఫేస్బుక్ లో కూడా వీడియోలకు ప్రాధాన్యం పెరిగేలా చూడటం వల్ల వినియోగదారులను అధిక సమయం ప్లాట్ ఫారం కు అతుక్కుపోయేలా చేయవచ్చని భావిస్తోంది. యూట్యూబ్ వంటి బలమైన ప్లాట్ ఫారం ను ఎదుర్కొనేందుకు ఇలాంటి వినూత్న సేవలు అవసరమని భావిస్తోంది.

30 కోట్ల కు పైగా...

30 కోట్ల కు పైగా...

ఫేస్బుక్ నకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 170 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అలాగే ఇండియా విషయానికి వస్తే సుమారు 33 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అదే యూట్యూబ్ కు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు. ఇండియా లో మాత్రం సుమారు 27 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కానీ, ఇటీవల ఇండియా లో యూట్యూబ్ కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. అది కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల వరకు యూట్యూబ్ చేరువ అవుతోంది. దీంతో వినియోగదారుల సంఖ్య పరంగా యూట్యూబ్ త్వరలోనే ఫేస్బుక్ ను దాటేసేలా ఉంది. అందుకే, ఒకవైపు ఇప్పటికే ఉన్న కన్సూమర్ల్ ను కాపాడుకోవటంతో పాటు కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ఫేస్బుక్ మ్యూజిక్ వీడియో బాట పట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary

Facebook brings official music videos to India

Facebook on Friday introduced 'official music videos' in India to showcase music videos from labels like T-Series Music, Zee Music Company, and Yash Raj Films on its platform. The music video experience on Facebook is available in India, Thailand, and the US. Users in India will be able to watch content from the country's top music labels - T-Series Music, Zee Music Company, and Yash Raj Films, a statement said.
Story first published: Saturday, August 1, 2020, 13:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more