For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నగదు హోల్డింగ్స్ కంటే బిట్‌కాయిన్ కాస్త బెట్టర్: ఎలాన్ మస్క్, మళ్లీ ముందుకొచ్చిన టెస్లా అధినేత

|

క్యాష్ అట్టిపెట్టుకోవడం కంటే బిట్ కాయిన్ కొనుగోలు చేయడం మంచిదని టెస్లా ఇంక్ సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. ఇటీవల టెస్లా క్రిప్టోకరెన్సీని భారీగా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎలాన్ బిట్ కాయిన్‌ను సమర్థిస్తున్నారు. క్యాష్ హోల్డింగ్స్ కంటే బిట్ కాయిన్ కలిగి ఉండటం కాస్త బెట్టర్ అని అభిప్రాయపడ్డారు. ఇటీవల బిట్ కాయిన్ భారీగా ఎగిసిపడుతోన్న విషయం తెలిసిందే. బిట్ కాయిన్ వ్యాల్యూ 50వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.37 లక్షలకు పైగా)కు పైగా ఉంది.

లక్షలు పలుకుతున్న క్రిప్టో: గాలి బుడగనా.. భయాన్ని కలిగిస్తున్న బిట్‌కాయిన్!లక్షలు పలుకుతున్న క్రిప్టో: గాలి బుడగనా.. భయాన్ని కలిగిస్తున్న బిట్‌కాయిన్!

మళ్లీ ఎలాన్ మస్క్ నెంబర్ వన్‌కు

మళ్లీ ఎలాన్ మస్క్ నెంబర్ వన్‌కు

ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ మళ్లీ అగ్రస్థానంలోకి వచ్చారు. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ తిరిగి రెండోస్థానానికి పరిమితమయ్యారు. ఎలాన్ మస్క్‌కి చెందిన రాకెట్ తయారీ సంస్థ స్పెస్ ఎక్స్ తాజాగా సెకోయా క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 850 మిలియన్ డాలర్ల నిధుల్ని సమీకరించింది. కంపెనీ వ్యాల్యూ 74 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. అంతకుముందు సమీకరించిన దాని కంటే ఇది 60 శాతం ఎక్కువ. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ సంపద నికర విలువ 11 బిలియన్ డాలర్లు ఎగిసి 199.9 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆయన నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బెజోస్ సంపద 194.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

జెఫ్ బెజోస్ ముందుకు.. వెనక్కి

జెఫ్ బెజోస్ ముందుకు.. వెనక్కి

టెస్లా షేర్స్ మూడు రోజుల క్రితం 2.4 శాతం పడిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ సంపద 4.6 బిలియన్ డాలర్లు హరించుకుపోవడంతో, గత మూడేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉంటున్న జెఫ్ బెజోస్ సంపద 191.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎలాన్ మస్క్ కంటే 955 మిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. కానీ తాజాగా మస్క్ సంపద దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు మస్క్ దాదాపు ఆరు వారాల పాటు ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు. మూడు రోజుల క్రితం జెఫ్ బెజోస్ మళ్లీ మొదటి స్థానంలోకి వచ్చినా, తిరిగి వెనక్కి పోయారు.

ఏడాదిలో 53 శాతం జంప్

ఏడాదిలో 53 శాతం జంప్

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఇటీవల క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. తన బ్యాలెన్స్ షీట్‌లో 1.5 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని కలిగి ఉంది. గత 12 నెలల కాలంలో అమెజాన్ స్టాక్స్ 53 శాతం లాభపడ్డాయి. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కోసం, జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు.

English summary

నగదు హోల్డింగ్స్ కంటే బిట్‌కాయిన్ కాస్త బెట్టర్: ఎలాన్ మస్క్, మళ్లీ ముందుకొచ్చిన టెస్లా అధినేత | Elon Musk says bitcoin is slightly better than holding cash

Tesla Chief Executive Officer (CEO) Elon Musk on February 19 defended Tesla's purchase of Bitcoin, saying that owning some of the digital currency is "adventurous enough" for an S&P 500 company.
Story first published: Saturday, February 20, 2021, 8:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X