For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Edible Oil Stocks: పండుగ పరుగులు మెుదలెట్టిన స్టాక్స్.. అదానీ, బాబా రాందేవ్ కంపెనీలు.. షేర్లు కొనొచ్చా..?

|

Edible Oil Stocks: పండుగ సీజన్‌కు ముందు ఎడిబుల్ ఆయిల్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్వల్పంగా వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎడిబుల్ ఆయిల్ కంపెనీల షేర్లు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ఈ రోజు అదానీ విల్మార్ లిమిటెడ్, పతంజలి ఫుడ్స్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. ఈ షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు లాభాల పంట కురిపిస్తున్నాయి.

 అదానీ విల్మార్ దూకుడు..

అదానీ విల్మార్ దూకుడు..

అదానీ విల్మార్ షేర్లు దాదాపు నాలుగు నెలల గరిష్ఠ స్థాయి అయిన రూ.808.10కి చేరుకున్నాయి. గత 5 రోజుల్లో ఈ షేరు 13.43 శాతం లాభపడింది. ఇది ఈ సంవత్సరం ఇప్పటివరకు 201 శాతం రాబడిని అందించింది. ప్రస్తుతం షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.808.10 వద్ద ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.227గా ఉంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ 'ఫార్చ్యూన్' భారతదేశంలో అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ గా కొనసాగుతోంది.

గ్రామీణ మార్కెట్ లక్ష్యంగా..

గ్రామీణ మార్కెట్ లక్ష్యంగా..

అదానీ విల్మార్ స్థిరమైన వృద్ధిని సాధించాలని, అన్ని ప్రధాన ప్యాకేజ్డ్ ఫుడ్ సెగ్మెంట్లలో భారతదేశపు అతిపెద్ద ఆహార FMCG కంపెనీగా అవతరించాలని భావిస్తోంది. కంపెనీ తన డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, టైర్-III నగరాలు, గ్రామీణ మార్కెట్లకు సరఫరా వ్యవస్థను ధృడంగా చేసేందుకు కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ విభాగాల్లో ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టబోతోంది. వీటి కారణంగా స్టాక్ పాజిటివ్ మెుమెంటంను కలిగి ఉంది.

 పతంజలి ఫుడ్స్..

పతంజలి ఫుడ్స్..

బాబా రామ్‌దేవ్ కంపెనీ పతంజలి ఫుడ్స్ గురించి మాట్లాడినట్లయితే.. ఈ స్టాక్ రెండవ రోజు కూడా టేకాఫ్ అయింది. ఈ రోజు పతంజలి ఫుడ్స్ షేర్లు కూడా అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు 5 శాతం పెరిగి రూ.1,467.25కి చేరింది. గత నెలలో ఈ షేరు 34 శాతానికి పైగా లాభపడింది. ఈ ఏడాది ఇప్పటివరకు స్టాక్ 41.18 శాతం మాత్రమే పెరిగింది. ఇది అదానీ విల్మార్ కంటే తక్కువ. బాబా రామ్‌దేవ్‌కి చెందిన ఈ కంపెనీ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ రుచి సోయా పేరుతో తన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తోంది.

 షేర్లు కొనాలా..? వద్దా..

షేర్లు కొనాలా..? వద్దా..

HDFC సెక్యూరిటీస్ విశ్లేషకులు పతంజలి ఫుడ్స్‌పై 'BUY' రేటింగ్‌ ఇస్తున్నారు."రెండు త్రైమాసిక కాల వ్యవధిలో, స్టాక్ యొక్క బేస్ ఫెయిర్ విలువ రూ. 1,490" అని బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. వేగవంతమైన వృద్ధికి, పెరుగుతున్న వాటాదారులకు పతంజలి ఫుడ్స్ మంచి స్థానంలో ఉందని బ్రోకరేజ్ అభిప్రాయపడుతోంది.

English summary

Edible Oil Stocks: పండుగ పరుగులు మెుదలెట్టిన స్టాక్స్.. అదానీ, బాబా రాందేవ్ కంపెనీలు.. షేర్లు కొనొచ్చా..? | Edible Oil Stocks adani wilmar and patanjali foods stocks skyrocking in wake of coming festival season

Edible Oil Stocks adani wilmar and patanjali foods stocks skyrocking in wake of coming festival season ..
Story first published: Wednesday, September 21, 2022, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X