కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్యాంకుల్లో రుణాలు పెరగడంతో పాటు రైటాఫ్స్ పెరిగి భారతీయ బ్యాంకులపై మున్ముందు తీవ్ర ఆర్థిక ఒత్తిడి పరిస్థితులు ఉండవచ్చునని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. భారత బ్యాంకులు కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయని తెలిపింది. అయితే రుణ నష్టాలు పరిమితం కావాలంటే ఆర్థిక పునరుద్ధరణ వేగంగా జరగాలని ఫిచ్ రేటింగ్ అభిప్రాయపడింది. కరోనా, లాక్ డౌన్ అనంతరం గత రెండు మూడు నెలలుగా ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ ఇంకా వేగంగా కోలుకోవాలని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ సమయంలో ఫిచ్ రేటింగ్స్ భారత బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వెల్లడించింది.

అది సానుకూల పరిణామం
మొండి బకాయిలు, రైటాఫ్స్ పెరిగాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. మహమ్మారి నేపథ్యంలో మొండి బకాయిలుగా మారిన రుణాలను ఓసారి పునర్ వ్యవస్థీకరించుకునేందుకు ఆర్బీఐ అనుమతి ఇవ్వడం సానుకూల పరిణామం అని తెలిపింది. అయితే పునర్ వ్యవస్థీకరించిన రుణాలు కస్టమర్లు తిరిగి చెల్లించకపోతే భవిష్యత్తులో మొండి బకాయిలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్బీఐ డేటా ప్రకారం భారతీయ బ్యాంకులు 2014-19 మధ్య దాదాపు 85 బిలియన్ డాలర్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల కారణంగా ఈ రంగంపై 80 శాతం ఆర్థిక ఒత్తిడి ఉంటోందని ఈ నివేదిక తెలిపింది. ప్రస్తుత రుణ వ్యవస్థీకరణ మరిన్ని సవాళ్లను సృష్టించకుండా ఉంటే చాలని తెలిపింది.

2.7 బిలియన్ డాలర్ల హామీ...
అలాగే 2.7 బిలియన్ డాలర్లను ప్రభుత్వరంగ బ్యాంకులకు అందిస్తామన్న ప్రభుత్వం హామీ ఇంకా అమలు కాలేదని ఫిచ్ పేర్కొంది. బ్యాంకులు వచ్చే ఏడాది రెండేళ్ల కాలంలో కఠిన సవాళ్లను ఎధుర్కొంటాయని పేర్కొంది. సరిపడా మూలధనం లేకుండా ప్రభుత్వరంగ బ్యాంకులు మంజూరు చేసే రుణాల్లో వృద్ధి సాధ్యం కాదని, ఈ మధ్య కాలానికి ప్రయివేటు రంగ బ్యాంకులు మార్కెట్ షేర్‌ను పెంచుకోవడానికి అనుకూలిస్తుందని ఫిచ్ తెలిపింది.

వృద్ధి రేటు అంచనా సవరణ
ఫిచ్ భారత వృద్ధి రేటు అంచనాను కూడా సవరించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటును మైనస్ 10.5 శాతానికి సవరించింది. అంతకుముందు మైనస్ 5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. మొదటి క్వార్టర్‌లో రియల్ జీడీపీ 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీలు పూర్తి ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును సవరిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications