For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభముహూర్తం: ఈ రోజు దీపావళి ముహూరత్ ట్రేడింగ్: సమయం, ఎంతసేపు ఉంటుందంటే?

|

దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ ఎక్స్చేంజీలు ఈ రోజు (శనివారం, నవంబర్ 14) ఒకగంట పాటు ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తాయి. సాయంత్రం గం.6.15 నుండి గం.7.15 వరకు ట్రేడింగ్ ఉంటుంది. దీపావళి బలిప్రతిపద సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవు ఉంటుంది. ప్రతి సంవత్సరం . దీపావళి రోజున మొదలయ్యే కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్‌తో ఆహ్వానం పలుకుతాయి.

సంవత్ 2077 ప్రారంభ సందర్భంగా సాయంత్రం ఒక గంట పాటు ట్రేడింగ్ ఉంటుంది. బీఎస్ఈలో 1957 నుండి దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. శుభముహూర్తం నేపథ్యంలో ట్రేడింగ్ ఒక పద్ధతిగా మారింది. ఈ సంవత్సరం కూడా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి.

 Diwali Muhurat Trading: Timing and significance of the one hour special trading

ప్రీ-ఓపెన్ ముహూరత్ సెషన్ సాయంత్రం గం.6:00 నుండి గం.6:08 వరకు ఉంటుంది. ఎనిమిది నిమిషాలు ప్రీ-ఓపెన్ ముహూరత్ ఉంటుంది. ముహూరత్ ట్రేడింగ్ గం.6:15 నుండి గం.7:15 వరకు ఉంటుంది. ఆ తర్వాత ప్రీ-క్లోజింగ్ ముహూరత్ సెషన్ సాయంత్రం గం.7:25 నుండి గం.7:35 మధ్య ఉంటుంది.

సంవత్ 2076లో పాతాళం నుండి రికార్డులు, సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్సంవత్ 2076లో పాతాళం నుండి రికార్డులు, సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్

కమోడిటీ ఎక్స్చేంజ్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) ముహూరత్ ట్రేడింగ్ శనివారం, నవంబర్ 14వ తేదీన(నేడు) సాయంత్రం గం.6 నుండి గం.6.14 వరకు స్పెషల్ సెషన్, ట్రేడింగ్ సెషన్ సాయంత్రం గం.6.15 నుండి గం.7.15 వరకు ఉంటుంది.

English summary

శుభముహూర్తం: ఈ రోజు దీపావళి ముహూరత్ ట్రేడింగ్: సమయం, ఎంతసేపు ఉంటుందంటే? | Diwali Muhurat Trading: Timing and significance of the one hour special trading

Stocks market in India remained closed on Diwali for normal trading but they conduct an one-hour special Muhurat trading session on every Diwali. This year also the BSE and the NSE will conduct Muhurat trading session on November 14 that will start at 6:15 and will last till 7:15. There will be pre-open Muhurat Session from 6:00 pm to 6:08 pm and a post-closing Muhurat Session between 7:25 pm and 7:35 pm.
Story first published: Saturday, November 14, 2020, 14:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X