For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger Stock: సూపర్ లాభాలనిచ్చిన మల్టీబ్యాగర్.. మళ్లీ వార్తల్లో నిలిచింది.. ఎందుకంటే

|

Multibagger Stock: ఇటీవల స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల కారణంగా చాలా కంపెనీల షేర్లు మంచి రాబడిని అందించలేకపోతున్నాయి. కానీ ఇలాంటి టైమ్ లో వజ్రంలా మెరుస్తున్న స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. అలా ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించిన స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది దీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ స్టాక్ గురించే. ఈ వారం కంపెనీ షేర్లు ఎక్స్- స్ప్లిట్ కానుండటంతో ఈ మల్టీబ్యాగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. దీనికి ముందు ఒక్కో షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.10గా ఉంది. షేర్ల స్ప్లిట్ తర్వాత ఒక్కో షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.1గా మారనుంది. అంటే.. ఒక్కో షేరును కంపెనీ 10 ముక్కలుగా చేయాలని నిర్ణయించింది. దీనికి జనవరి 20వ తారీఖును కంపెనీ రికార్డు తేదీగా నిర్ణయించింది.

సూపర్ రాబడి..

సూపర్ రాబడి..

డైమండ్ వ్యాపారంలో ఉన్న ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గడచిన ఏడాది కాలంలో తన ఇన్వెస్టర్లకు దాదాపు 842% రాబడిని అందించింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా లాబపడ్డారు. అలాగే ఆరు నెలల కాలంలో స్టాక్ దాదాపు 339% లాభపడింది. అదే విధంగా 5 ఏళ్ల కాలాన్ని పరిశీలించినట్లయితే స్టాక్ ఏకంగా 1000 శాతం రాబడిని అందించింది. అయితే ఈరోజు స్టాక్ దాదాపుగా 5 శాతం నష్టపోయి రూ.145.40 రేటు వద్ద ట్రేడ్ అవుతోంది.

కంపెనీ లాభాలు..

కంపెనీ లాభాలు..

దీప్ డైమండ్ ఇండియా కంపెనీ ఇటీవలే తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ రూ.61 లక్షల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే రెట్టింపు. దీనికి ముందు సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో కంపెనీ దాదాపు రూ.32 లక్షల నికర లాభాన్ని ఆర్జించింది. డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ ఖర్చులను తగ్గించుకోవటం లాభాల పెరుగుదలకు దారితీసింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.171గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.11 వద్ద ఉంది.

 స్టాక్ స్ప్లిట్ అంటే ఏమిటి?

స్టాక్ స్ప్లిట్ అంటే ఏమిటి?

మార్కెట్లో స్టాక్ లిక్విడిటీని పెంచడానికి కంపెనీలు స్టాక్ స్ప్లిట్ ప్రకటిస్తుంటాయి. దీని వల్ల మార్కెట్లో ట్రేడ్ అయ్యే షేర్ల సంఖ్య లభ్యత పెరుగుతుంది. అందువల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు లేదా పెట్టుబడి పెట్టేందుకు వీలు ఉంటుంది. దీని కోసం కంపెనీలు రికార్డు తేదీలను ప్రకటిస్తుంటాయి. ఆ గడువు తర్వాత షేర్లను చిన్న ముక్కలుగా చేస్తాయి. దీంతో అదనంగా వచ్చిన షేర్లు ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలోకి నేరుగా జమచేయబడతాయి. స్టాక్ ధర కూడా స్ప్లిట్ రేషియో ప్రకారం సర్దుబాటు చేయబడుతుంది.

English summary

Multibagger Stock: సూపర్ లాభాలనిచ్చిన మల్టీబ్యాగర్.. మళ్లీ వార్తల్లో నిలిచింది.. ఎందుకంటే | Deep Diamond India stock gave multibagger returns and now stock splitting

Deep Diamond India stock gave multibagger returns and now stock splitting
Story first published: Wednesday, January 18, 2023, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X