For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pakistan: పాక్ కు శాపంగా మారిన చైనా కుతంత్రం.. ప్రతి సారీ అదే మాట.. మెల్లగా మింగేస్తోంది..

|

Pakistan Debts: రెండు రోజుల కిందటే గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చాం.. హమ్మయ్యా అనుకునే లోపే పాకిస్తాన్ కు మరిన్ని కష్టాలు మెుదలయ్యాయి. చైనా గాలంలో చిక్కుకున్న దాయాదికి అదో పెద్ద అప్పుల ఊబని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.

డెట్ రీస్ట్రక్చరింగ్..

డెట్ రీస్ట్రక్చరింగ్..

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో పాకిస్తాన్ ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల రుణాలను పొందింది. రానున్న డిసెంబర్ లో చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్లను రోలోవర్ చేయాలని సౌదీ అరేబియాను కోరింది. ఈ క్రమంలో పాక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్టర్నల్ లోన్స్ మెుత్తం 34 బిలియన్ డాలర్లు అవసరం. ఈ క్రమంలో రానున్న 8 నెలల్లో చెల్లించాల్సిన 6.3 బిలియన్ డాలర్ల రుణానికి గడువు పెంచాలని పాకిస్తాన్ చైనాను అభ్యర్థించింది.

చైనాతో చర్చలు..

చైనాతో చర్చలు..

పాక్ చెల్లించాల్సిన 6.3 బిలియన్ డాలర్ల రీఫైనాన్సింగ్ విషయంపై చైనా రాయబారి నోంగ్ రాంగ్, ఆర్థిక మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ శనివారం చర్చించినట్లు తెలుస్తోంది. వీటికి అదనంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 900 మిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక చైనీస్ అప్పులు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నవంబర్ 1న బీజింగ్‌ను సందర్శిస్తున్నారు. అయితే రుణ చెల్లింపులు, కొత్త ప్రాజెక్టుల ఫైనాన్సింగ్ వంటి కీలక అంశాలు ఈసారి ఎజెండాలో ప్రధానమైనవిగా తెలుస్తోంది.

నిండా ముంచిన CPEC..

నిండా ముంచిన CPEC..

ఎకనామిక్ కారిడార్ పేరుతో చైనా చాలా దేశాలను అప్పుల పాలు చేసింది. అలా ఆర్థికంగా చిన్నాభిన్నమైనదే మన పక్కన ఉన్న శ్రీలంక. సీపీఈసీ అనేది చైనా స్వార్ధపూరితమైన ఒక మెగా వ్యాపార విస్తరణ ప్రాజెక్ట్. అభివృద్ధిని ఎరగా వేసి చిన్న దేశాలను ఇందులో భాగస్వాములుగు చేసుకుంది చైనా. అయితే ఇప్పుడు వారికి ఇచ్చిన అప్పులు, వాటికి వడ్డీలు కలిపితే అవి పెద్ద అప్పుల ఊబిగా మారాయి. ప్రస్తుతం పాకిస్తాన్ సైతం ఇందులో చిక్కుకుని బయటకు రాలేక ప్రతిసారీ అప్పుల రీఫైనాన్సింగ్ కోసం చేయి చాచుతోంది.

Read more about: debts pakistan china cpec
English summary

Pakistan: పాక్ కు శాపంగా మారిన చైనా కుతంత్రం.. ప్రతి సారీ అదే మాట.. మెల్లగా మింగేస్తోంది.. | Debt Ridden Pakistan Requested China To Rollover 6 Billion Dollar Dues

Debt Ridden Pakistan Requested China To Rollover 6 Billion Dollar Dues
Story first published: Monday, October 24, 2022, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X