For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto Prices Today: నష్టాల నుండి లాభాల్లోకి బిట్ కాయిన్, కార్డానో 'డబుల్' లాస్

|

క్రిప్టో కరెన్సీ నేడు (గురువారం, జనవరి 20) పుంజుకుంది. గత కొద్దిరోజులుగా క్రిప్టో మార్కెట్ భారీ ఊగిసలాటలో ఉంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి ఏకంగా 1400 డాలర్ల వరకు లాభపడి 43,100 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఉదయం 42,000 డాలర్ల దిగువన ప్రారంభమైన ఈ డిజిటల్ కరెన్సీ, మధ్యాహ్నం వరకు దాదాపు అదే స్థాయిలో ఉంది. అయితే ఈ వార్త రాసే రెండు గంటల ముందు హఠాత్తుగా ఎగిసిపడింది. దీంతో 42,000 క్రాస్ చేయడమే కాకుండా 43,000 కూడా దాటింది.

నేటి ఉదయం సెషన్‌లో బిట్ కాయిన్ 42,000 డాలర్ల పైన ఉండగా, రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం 3200 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 3 శాతం పెరిగి 75.18 బిలియన్ డాలర్లుగా నమోదయింది. టాప్ 10 డిజిటల్ టోకెన్స్‌లో ఏడు కూడా ప్రారంభంలో నష్టపోయాయి. కానీ ఆ తర్వాత క్రమంగా ఎక్కువ టోకెన్స్ లాభపడ్డాయి.

Cryptocurrency

నేడు ఉదయం సెషన్‌లో బిట్ కాయిన్ నష్టపోయినప్పటికీ, సాయంత్రానికి లాభపడింది. ఎథేరియం కూడా ఉదయం నష్టపోయి, ఆ తర్వాత ఎగిసిపడింది. టెథేర్, సోలానా, ఎక్స్‌పీఆర్, పోల్కాడాట్ డిజిటల్ టోకెన్స్‌లో ఎక్కువగా నష్టపోయాయి. టెథేర్, యూఎస్‌డీ కాయిన్ దాదాపు స్థిరంగా ఉన్నాయి. కార్డానో మాత్రం ఉదయం పది శాతం వరకు నష్టపోయింది.

English summary

Crypto Prices Today: నష్టాల నుండి లాభాల్లోకి బిట్ కాయిన్, కార్డానో 'డబుల్' లాస్ | Cryptocurrency Today Prices : Ethereum, Cardano, Litecoin decline

Crypto prices continued to slide on Thursday, following sluggish macroeconomic conditions, rise in oil prices and tapering cues from the Federal Reserve. Rising inflation and slump in the technology market added to the woes.
Story first published: Thursday, January 20, 2022, 21:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X