2022లో క్రిప్టో కరెన్సీ టఫ్‌గా ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రారంభం నుండి పలు క్రిప్టోలు క్షీణించాయి. మంగళవారం (జనవరి 4) ఉదయం క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 0.61 శాతం నష్టంతో ప్రారంభమైంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ 49,922 డాలర్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత భారీగా నష్టపోయినప్పటికీ, క్రితం సెషన్‌తో పోలిస్తే స్వల్ప లాభాల్లో ఉంది. బిట్ కాయిన్ ఈ రెండు మూడు సెషన్లలో 52,000 డాలర్ల మార్కుకు చేరుకుంది. అయితే ప్రస్తుతం 47,000 డాలర్ల దిగువనే ఉంది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 471 డాలర్లు మాత్రమే లాభపడి 46,906 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది.
వరల్డ్ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 4037 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే 0.83 శాతం క్షీణించింది. బియాన్స్ కాయిన్, కార్డానో, టెర్రా 4 శాతం చొప్పున నష్టపోయాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 2.21 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 2 శాతం తగ్గి 88.42 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

వివిధ క్రిప్టో ధరలు
బిట్ కాయిన్ - 46,723.27 - 1.22% క్షీణత - 883.96 బిలియన్ డాలర్లు
ఎథేరియం - 3,827.55 - 0.27% క్షీణత - 450.38 బిలియన్ డాలర్లు
డోజీకాయిన్ - 0.171674 - 0.73% క్షీణత - 22.77 బిలియన్ డాలర్లు
లైట్ కాయిన్ - 149.95 - 0.62% క్షీణత - 10.40 బిలియన్ డాలర్లు
XRP - 0.835687 - 0.84% క్షీణత - 83.56 బిలియన్ డాలర్లు
కార్డానో - 1.33 - 2.69% క్షీణత - 43.87 బిలియన్ డాలర్లు
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications