క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్‌బేస్ లిస్టింగ్ అయింది. ఈ షేర్ ధర ఓ సమయంలో భారీగా ఎగిసి, ఆ తర్వాత లిస్టింగ్ కంటే దిగువకు పడిపోయింది. అమెరికాలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్‌బేస్. ఇది నేడు నాస్‌డాక్‌లో లిస్ట్ అయింది. ప్రారంభంలో 381 డాలర్ల వద్ద కనిపించింది. ఆ తర్వాత 400 డాలర్లకు పైకి కూడా చేరుకుంది. అయితే అంతలోనే 300 డాలర్ల దిగువకు పడిపోయింది. అయినప్పటికీ కాయిన్ 55 శాతం పెరిగింది. ఈ యూఎస్ క్రిప్టో ఎక్స్చేంజ్ దిగ్గజం 100 బిలియన్ డాలర్లకు దిగువన ఉంది.

క్రిప్టోకు ప్రోత్సాహకరం
కాయిన్‌బేస్‌కు ఇప్పటి వరకు అధికారిక హెడ్ క్వార్టర్ లేదు. ఈ క్రిప్టో దిగ్గజం వాల్ స్ట్రీట్ పెట్టుబడి బ్యాంకులపై ఆధారపడకుండా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)ను వదులుకోవాలని, దీనికి బదులు నాస్‌డాక్ స్టాక్ ఎక్స్చేంజీతో తన వాటాలను నేరుగా లిస్టింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అనలిస్ట్స్, ట్రేడర్స్, ఆర్థికవేత్తలు ఈ స్టాక్ సేల్‌ను క్రిప్టోకరెన్సీకి ప్రోత్సాహకరమైనదిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది.

ఇదీ కాయిన్ బేస్
ఇటీవలి ఎక్స్చేంజీ ధరల ప్రకారం కాయిన్‌బేస్ మార్కెట్ క్యాపిటలైజే,న్ 76 బిలియన్ డాలర్లుగా ఉంది. 199.2 మిలియన్ల ఔట్ స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి. డిల్యూటెడ్ షేర్ కౌంట్ 261.3 మిలియన్లు. కాయిన్ డెస్క్ ప్రకారం మొత్తం వ్యాల్యూ 99 బిలియన్ డాలర్లు. ఈ శాన్‌ఫ్రాసిస్కో కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 56 మిలియన్ల యూజర్లను కలిగి ఉంది. వెబ్ సైట్ పైన 223 బిలియన్ డాలర్ల అసెట్స్ ఉంటాయని అంచనా. క్రిప్టో మార్కెట్లో ఈ వాటా 11.3 శాతం.

బిట్ కాయిన్ జంప్
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ బుధవారం 64000 డాలర్లను క్రాస్ చేసి, సరికొత్త గరిష్టాలను తాకింది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేర్ 2400 డాలర్లను దాటింది. ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications