For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్డులతో ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా.. అయితే జూలై 1 నుంచి ఇది తప్పనిసరి.. మీ సేఫ్టీకోసమే..

|

జూలై 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డ్ టోకనైజేషన్ విధానం దేశవ్యాప్తంగా అమలులోకి వస్తోంది. అయితే దీని గురించి మీరు తప్పక తెెలుసుకోవలసిందే. జూలై 1 నుంచి భారతదేశం అంతటా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ టోకనైజేషన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా నిబంధనలు, ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. టోకనైజేషన్ ఆన్‌లైన్ వ్యాపారులను వారి సర్వర్‌లలో కస్టమర్ డేటాను నిల్వ చేయకుండా నిషేధిస్తుంది. ఇందులో కార్డ్ నంబర్, CVV, గడువు తేదీ ఇతర సున్నితమైన, కీలకమైన సమాచారం ఉంటాయి. ఈ సమాచారం దుర్వినియోగం కాకుండా, సైబర్ నేరగాళ్ల వలలో కీలక సమాచారం చిక్కకుండా చూసేందుకు చేస్తున్న చర్యల్లో భాగంగా రిజర్వు బ్యాంక్ ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

టోకెన్ల జారీకి పరిమితి ఎంతంటే..

టోకెన్ల జారీకి పరిమితి ఎంతంటే..

కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ (CoFT) అనే ప్రక్రియలో ఈ సున్నితమైన వివరాలు "టోకెన్" అని పిలువబడే ఒక ప్రత్యేక కోడ్‌తో భర్తీ చేయబడతాయి. ఒక వినియోగదారుడు తన కార్డ్‌ని ఉపయోగించి ఒకటికంటే ఎక్కువ టోకెన్‌లను సృష్టించవచ్చు ఉదాహరణకు.. వారు తమ కార్డ్ వివరాలను ఐదుగురు వ్యాపారులకు సంబంధించిన వెబ్ సైట్లు లేదా యాప్స్ లో సేవ్ చేసినట్లయితే.. వారు ప్రతి యాప్‌కి 5-6 టోకెన్‌లను జనరేట్ చేసుకోవచ్చని తెలుస్తోంది.

కార్డు వివరాలు ఇకపై సేఫ్..

కార్డు వివరాలు ఇకపై సేఫ్..

వ్యాపారులు తమ యాప్స్, వెబ్ సైట్లలో చెల్లింపుల సమయంలో స్టోర్ చేయగల ఏకైక వివరాలు కేవలం కార్డ్‌లోని చివరి 4 అంకెలు మాత్రమేనని తెలుస్తోంది. బ్యాంక్ అందించిన పోర్టల్ ద్వారా సెక్యూర్డ్ కార్డ్‌లను మేనేజ్ చేయవచ్చు. టోకనైజేషన్ సిస్టమ్ పూర్తిగా ఉచితం. దేశీయ ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. తొలివిడతలో దేశీయ వినియోగానికి దీనిని పరిమితం చేయనున్నట్లు సమాచారం. టోకనైజేషన్ అనేది ఆన్‌లైన్ కార్డ్ లావాదేవీలు సురక్షితమైనవని నిర్ధారిస్తుంది. ఎందుకంటే అసలు కార్డ్ వివరాలు వ్యాపారుకు పంచుకోవటం జరగదు. పైగా ఇకపై వారు మీ కార్డుల సమాచారాన్ని నిల్వ చేసుకోవటం కుదరదు.

టోకెనైజేషన్ చేసుకోకపోతే..

టోకెనైజేషన్ చేసుకోకపోతే..

వినియోగదారు ఆన్‌లైన్ లావాదేవీని ప్రారంభించి, చెక్ అవుట్ చేసినప్పుడు, వారు తమ కార్డ్‌ని "సెక్యూర్" లేదా "ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం సేవ్ కార్డ్"కి ప్రమోట్ చేయబడతారు. వారు OTPని నమోదు చేసిన తర్వాత, వారి కార్డ్ వివరాలు సురక్షితంగా ఉంటాయి. జూలై 1, 2022లోపు కార్డ్‌లను టోకనైజ్ చేయడంలో చేసుకోకపోతే.. ఏదైనా వ్యాపారి వెబ్‌సైట్/అప్లికేషన్‌లో సేవ్ చేయబడిన వారి కార్డ్ వివరాలు తొలగించబడతాయి. పైగా లావాదేవీ చేస్తున్న ప్రతిసారీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

English summary

కార్డులతో ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా.. అయితే జూలై 1 నుంచి ఇది తప్పనిసరి.. మీ సేఫ్టీకోసమే.. | credit and debit cards tokenisation was coming into effect from july 1st rbi said

for cards safety tocanisaztion was brought by rbi in india know about it in detail
Story first published: Wednesday, June 22, 2022, 12:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X