For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లపై కరోనా దెబ్బ, ఎల్ఐసీకి రూ.1.9 లక్షల కోట్ల నష్టం

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిపోయి, ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైన విషయం తెలిసిందే. లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున పోయాయి. కరోనా కారణంగా గురువారం వరకు స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూశాయి. ఈ ఏడాదిలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు దాదాపు 30% మేర పతనమయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ కూడా అదే స్థాయిలో కరిగిపోయింది.

2019 డిసెంబర్ నాటికి మార్కెట్లో ఎల్ఐసీ మొత్తం పెట్టుబడుల విలువ రూ.6.02 లక్షల కోట్లు కాగా, స్టాక్ మార్కెట్ల వరుస పతనాలతో కంపెనీ పెట్టుబడుల విలువ ప్రస్తుతం రూ.4.14 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటివరకు రూ.1.88 లక్షల కోట్లు (31%) ఎల్ఐసీ ఆస్తులు హరించుకుపోయాయి. మార్కెట్లో లిస్ట్ అయిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, ఇన్సురెన్స్ కంపెనీల్లోని ఎల్ఐసీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో పడిపోయాయి.

వరల్డ్ మోస్ట్ ఎథికల్ కంపెనీల జాబితాలో టాటా స్టీల్, విప్రోవరల్డ్ మోస్ట్ ఎథికల్ కంపెనీల జాబితాలో టాటా స్టీల్, విప్రో

Coronavirus burns Rs 2 trillion hole in LICs investments

ఈ కంపెనీల కారణంగా ఎల్ఐసీ మొత్తం పెట్టుబడుల విలువ 30% లేదా రూ.56,810 కోట్ల వరకు తగ్గి ఉంటుందని అంచనా. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ రూ.36,020 కోట్లు, సిగరేట్ తయారీ కంపెనీలు మరో రూ.17,374 కోట్లు, ఐటీ కంపెనీల్లోని పెట్టుబడుల వ్యాల్యూ రూ.15,826 కోట్లు, మెటల్స్ రూ.12 వేల కోట్లు, ఆటోమొబైల్ రూ.11,329 కోట్లు, ఇన్ఫ్రా కంపెనీల వ్యాల్యూ రూ.10,669 కోట్లు హరించుకుపోయాయని అంచనా.

English summary

మార్కెట్లపై కరోనా దెబ్బ, ఎల్ఐసీకి రూ.1.9 లక్షల కోట్ల నష్టం | Coronavirus burns Rs 2 trillion hole in LIC's investments

A 30 per cent drop in the S&P BSE Sensex and the Nifty 50 thus far in the calendar year 2020 (CY20) has weighed heavily on the fortunes of state-owned life insurer, Life Insurance Corporation of India (LIC), which has suffered a notional loss of about Rs 1.9 trillion in the past two-and-half months.
Story first published: Friday, March 20, 2020, 14:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X