For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా దెబ్బతో కుప్పకూలిన ఆ దేశ ఎకానమీ, శాలరీ లేక 20 రాత్రులు వీధుల్లోనే

|

కరోనా మహమ్మారి కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. వృద్ధి దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. ఈ వైరస్ కారణంగా అమెరికాలో కోట్లాది ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకోవడం ప్రారంభమైంది. చమురు మీద ఆధారపడే దేశాలకు రెండు రకాలుగా నష్టం జరిగింది. ఒకటి కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే, ఇదే మహమ్మారి కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో నష్టం మిగతా దేశాలతో పోలిస్తే అధికం.

59 యాప్స్ నిషేధంపై WTOకు వెళ్తే... ఈ కారణాలతో చైనా అడ్డంగా బుక్కైనట్లే!59 యాప్స్ నిషేధంపై WTOకు వెళ్తే... ఈ కారణాలతో చైనా అడ్డంగా బుక్కైనట్లే!

ఫుడ్ కొనలేక.. నిరాశ్రయులు

ఫుడ్ కొనలేక.. నిరాశ్రయులు

కరోనా, చమురు ధరలు పడిపోవడంతో రష్యా తీవ్రంగా దెబ్బతిన్నది. రష్యా బడ్జెట్‌లో 40 శాతం వరకు చమురు, గ్యాస్ రంగం నుండి వచ్చే ట్యాక్స్‌లు వంటివాటిపై ఆధారపడి ఉంటుంది. మార్చి నుండి రష్యన్ సంస్థలు దెబ్బతింటున్నాయి. గతంలో ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోని వారు ఇప్పుడు దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొన్ని కుటుంబాలు అయితే ఆహారం కూడా కొనలేని పరిస్థితి ఉందట. చాలామంది నిరాశ్రయిలయ్యారు.

నిరుద్యోగ రేటు

నిరుద్యోగ రేటు

రష్యన్ ఫెడరల్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ ప్రకారం మే చివరి నాటికి 4.5 మిలియన్ల మందికి ఉద్యోగం లేదని అంచనా. మార్చి నుండి ఇది 85 శాతం పెరిగింది. కరోనాకు ముందు డేటా ప్రకారం నిరుద్యోగం 1.3 మిలియన్లుగా ఉంది. ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 5.8 శాతంగా ఉండగా ప్రస్తుతం 6.1 శాతానికి పెరిగింది. అమెరికాలో జూన్ నిరుద్యోగిత రేటు 11.1 శాతానికి తగ్గింది. ఏప్రిల్ నెలలో ఇది 14.7 శాతంగా ఉంది.

దెబ్బతిన్న పరిశ్రమ

దెబ్బతిన్న పరిశ్రమ

మే నెలలో రష్యా ఇండస్ట్రియల్ ఔట్‌పుట్ 9.6 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ భారీగా దెబ్బతిన్నది. గత ఏడాదితో పోలిస్తే మే నెలలో 42.2 శాతం పడిపోయింది. రష్యా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.5 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరోనా కారణంగా రష్యాలో వేలు, లక్షలాది వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

20 రోజులు వీధుల్లో.. కొందరి పరిస్థితి దారుణం

20 రోజులు వీధుల్లో.. కొందరి పరిస్థితి దారుణం

కొంతమంది పరిస్థితి భయానకంగా ఉంది. షట్ డౌన్ కారణంగా డిమాండ్ లేకపోవడంతో ఓ వెల్డర్‌ను యజమాని ఉద్యోగంలో నుండి తొలగించాడు. దీంతో సదరు వెల్డర్ 20 రాత్రుళ్లు వీధిల్లోనే గడిపాడు. యజమానికి అతనికి 75,000 రూబుల్స్ (1,070 డాలర్లు) ఇచ్చేవాడు. ఉద్యోగం పోవడంతో వేతనం లేదు. వర్కర్స్ హాస్టల్లో డబ్బులు చెల్లించలేకపోవడంతో వీధుల్లో ఉండాల్సి వచ్చింది.

English summary

కరోనా దెబ్బతో కుప్పకూలిన ఆ దేశ ఎకానమీ, శాలరీ లేక 20 రాత్రులు వీధుల్లోనే | Corona tanks Russian economy, plunges families into crisis

As countries across the globe has been facing the worst collective economic downturn since the Great Depression, Russia seems to be particularly hard hit by the twin blows of the coronavirus pandemic as well as the collapse in oil prices.
Story first published: Sunday, July 5, 2020, 15:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X