For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 దశాబ్దాల కనిష్టానికి పతనం, కరోనాను ఎదుర్కొని అదరగొట్టిన చైనా!

|

బీజింగ్: చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది. కరోనా కారణంగా 2020 మొదటి త్రైమాసికంలో జీడీపీ భారీగా క్షీణించినప్పటికీ ఆ తర్వాత త్రైమాసికాల్లో క్రమంగా పుంజుకోవడం ప్రారంభించింది. దీంతో 2020 పూర్తి సంవత్సరానికి గాను చైనా ఎకానమీ 2.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మిగతా దేశాలతో పోలిస్తే చైనా వృద్ధి సానుకూలంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు ముందే అంచనాలు వేశారు. దాదాపు అన్ని దేశాల జీడీపీ పూర్తి సంవత్సరానికి గాను మైనస్‌లలో ఉంటుందని భావిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ మైనస్ 7.5 శాతంగా వివిధ రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

దశాబ్దాల కనిష్టానికి..

దశాబ్దాల కనిష్టానికి..

2020 క్యాలెండర్ ఏడాదిలో చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడంతో, జీడీపీ అంచనాలకు మించి (2.3 శాతం) నమోదు చేసింది. అమెరికా తర్వాత ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. చైనా వార్షిక వృద్ధి రేటు గత కొన్ని దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. 1976 తర్వాత చైనాకు దారుణ వృద్ధి రేటు ఇది. సామాజిక, ఆర్థిక సంస్కరణలు, గందరగోళం నేపథ్యంలో అప్పుడు జీడీపీ 1.6 శాతానికి పడిపోయింది. కరోనా కారణంగా చైనా కూడా ప్రారంభంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత కోలుకొని, పాజిటివ్ వృద్ధి రేటును నమోదు చేసింది.

అంచనాలకు మించి

అంచనాలకు మించి

2020లో చైనా వృద్ధి రేటు 1.9 శాతంగా ఉండవచ్చునని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) అంచనా వేసింది. ప్రపంచ అతిపెద్ద ఎకానమీల్లో పాజిటివ్ గ్రోత్ ఉంటుందని ఐఎంఎఫ్ చెప్పిన దేశాల్లో చైనా మాత్రమే ఉంది. డ్రాగన్ దేశం ఈ అంచనాలను కూడా మించి వృద్ధిని నమోదు చేసింది. వృద్ధి రేటు అంచనాలకు మించి ఉందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అధికార ప్రతినిధి నింజ్ జిఝే అన్నారు.

పరిశ్రమ వృద్ధి జంప్

పరిశ్రమ వృద్ధి జంప్

కరోనా వల్ల చైనా జీడీపీ 2020 మొదటి త్రైమాసికంలో 7 శాతం మేర క్షీణించింది. కరోనా లాక్ డౌన్, ఆంక్షల కారణంగా ప్రభావం వృద్ధిపై ప్రభావం పడింది. అయితే ఆ తర్వాత రెండో త్రైమాసికం నుండి వృద్ధి సానుకూలంగా ఉంది. ఇన్ఫ్రా ప్రాజెక్టులు, భారీ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడం ద్వారా ప్రజల చేతికి డబ్బులు వచ్చేలా చేసి ఖర్చులు పెంచే చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఇండస్ట్రియల్ గ్రోత్ వృద్ధికి తోడ్పడింది. డిసెంబర్ నెలలో ఈ వృద్ధి 7.3 శాతంగా నమోదయింది.

English summary

4 దశాబ్దాల కనిష్టానికి పతనం, కరోనాను ఎదుర్కొని అదరగొట్టిన చైనా! | China's economy grows 2.3 percent in 2020 as recovery quickens

China's economy grew more than expected last year, even as the rest of the world was upended by the coronavirus pandemic.
Story first published: Monday, January 18, 2021, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X