For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్‌కు చైనా విరుగుడు మంత్రం: 4 వారాల్లో ఇమ్యూనిటీ బూస్ట్: కొత్త వ్యాక్సిన్‌పై స్టడీ

|

బీజింగ్: నారు వేసిన వాడే నీరు పోస్తాడని పెద్దలు చెబుతుంటారు. చైనా-కరోనా విషయంలో ఇది నిజం అయ్యేలా కనిపిస్తోంది. లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంటోన్న కరోనా వైరస్‌కు జన్మనిచ్చిన చైనా.. దానికి విరుగుడు మందునూ కనిపెడుతోంది. చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వల్ల నాలుగు వారాల్లోనే పేషెంట్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తేలింది. ఆ వ్యాక్సిన్ పేరు- కరోనావ్యాక్. సినోవాక్‌ బయోటెక్‌ ప్రయోగాత్మక ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. సినోవాక్‌ బయోటెక్ సంస్థ యాజమాన్యం ప్రస్తుతం ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీలో మూడవ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలను సినోవాక్ బయోటెక్ సంస్థ బుధవారం వెల్లడించింది. చైనాలో అభివృద్ధి చేసిన కరోనావాక్ సహా నాలుగు వ్యాక్సిన్లు చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌ కరోనా పేషెంట్లపై ఎలాంటి ఫలితాలను చూపించిందనే విషయంపై మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్‌‌లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. కరోనావ్యాక్ తొలి, మలి దశల్లో నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో 700 వలంటీర్లు పాల్గన్నారని ఈ జర్నల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఇతర వ్యాక్సిన్‌లతో పోలిస్తే..కరోనావ్యాక్ పేషెంట్ శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని నాలుగు వారాల్లోనే అందించగలదని వైద్య నిపుణులు తెలిపారు.

Chinas CoronaVac triggered a quick immune response Within 4 Weeks: Study

14 రోజుల వ్యవధిలో రెండు డోసుల కరోనావ్యాక్ వ్యాక్సిన్‌ను ఇవ్వడం ద్వారా నాలుగు వారాల్లోనే రోగనిరోధక శక్తి పెరిగినట్లు పరిశోధనల్లో తేలిందని గ్ఝు పెంగ్‌కై తెలిపారు. వైరస్ బారిన పడిన పేషెంట్‌కు అత్యవసరంగా ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించడం వల్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతున్నట్లు గ్ఝు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారించడానికి కరోనావ్యాక్‌ ద్వారా ఉత్పన్నమయ్యే రోగనిరోధక శక్తి సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు కీలకమైనవిగా భావిస్తున్నట్లు ఈ జర్నల్‌లో రాశారు.

ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 36 డిగ్రీల నుంచి మైనస్ 46 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేయవచ్చని, దీని కాల పరిమితి మూడేళ్లు ఉంటుందని గ్యాంగ్‌జెంగ్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ నిల్వ చేసేందుకు అనువుగా లేని ప్రాంతాలకు కూడా దీన్ని పంపిణీ చేయడానికి ఈ ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఫైజర్‌, బయోఎంటెక్‌, మోడెర్నా వ్యాక్సిన్‌లతో పోల్చుకుంటే.. అతి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరోనావ్యాక్‌ను నిల్వ ఉంచుకోవడానికి వీలుందని గ్యాంగ్ జెంగ్ తెలిపారు. ఇప్పటికే ఇండోనేషియా, బ్రెజిల్‌లు తమ దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయని అన్నారు.

Read more about: china చైనా
English summary

కరోనా వైరస్‌కు చైనా విరుగుడు మంత్రం: 4 వారాల్లో ఇమ్యూనిటీ బూస్ట్: కొత్త వ్యాక్సిన్‌పై స్టడీ | China's CoronaVac triggered a quick immune response Within 4 Weeks: Study

Sinovac Biotech's experimental COVID-19 vaccine CoronaVac triggered a quick immune response but the level of antibodies produced was lower than in people who had recovered from the disease, preliminary trial results showed on Wednesday.
Story first published: Wednesday, November 18, 2020, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X