For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రద్దు చేయలేదు కానీ.. రూ.5,000 కోట్ల చైనా ప్రాజెక్టులపై మహారాష్ట్ర కీలక నిర్ణయం

|

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలుఈ రెండు దేశాల వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారతీయుల్లో ఎక్కువమంది చైనా వస్తువులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది నాటికి చైనా నుండి దిగుమతులు పెద్ద ఎత్తున తగ్గాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.5,020 కోట్ల పెట్టుబడితో చైనా కంపెనీలు చేపట్టాల్సిన 3 ప్రాజెక్టుల్ని ఉద్దవ్ థాకరే నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని నిలిపివేయలేదు. ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచారు. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి ప్రకటించారు.

చైనా ఉత్పత్తులకు రాంరాం, సర్వేలో 87% మంది చెప్పింది ఇదేచైనా ఉత్పత్తులకు రాంరాం, సర్వేలో 87% మంది చెప్పింది ఇదే

మూడు భారీ ఒప్పందాలు

మూడు భారీ ఒప్పందాలు

ఈ అవగాహన ఒప్పందాల(MOU)పై పది రోజుల క్రితం సంతకాలు జరిగాయి. గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణకు కొద్దిరోజుల ముందు మాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పేరుతో ఉద్ధవ్ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్టర్ల సమావేశంలో ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటర్స్ రూ.3,770 కోట్లతో, పీఎంఐ ఎలక్ట్రోమొబిలిటీ రూ.1,000 కోట్లతో, హెంగ్లీ ఇంజినీరింగ్ రూ.250 కోట్లతో ఈ ఒప్పందాల్ని కుదుర్చుకున్నాయి. అయితే ఈ మూడు ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రాజెక్టులపై యథాతథ స్థితి

ప్రాజెక్టులపై యథాతథ స్థితి

దీనిపై మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుబాష్ దేశాయ్ స్పందించారు. ఈ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయలేదని, వాటిని హోల్డ్‌లో పెట్టామన్నారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులను రద్దు చేయకుండా పక్కన పెట్టామని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ ఈ మూడు ఒప్పందాలను రద్దు చేసినట్లు కాదని, ఈ ప్రాజెక్టులపై యథాతథ స్థితి కొనసాగుతుందన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల భవితవ్యంపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

చైనా పెట్టుబడులపై...

చైనా పెట్టుబడులపై...

చైనా కంపెనీలు - మహారాష్ట్ర మధ్య గ్రేట్ వాల్ మోటార్స్ (రూ.3,770 కోట్లు), పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్-ఫోటోన్(రూ.1,000 కోట్లు), హెంగ్లీ ఇంజినీరింగ్ (రూ.250 కోట్లు) ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ పెట్టుబడులపై స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి సమాచారం రావాల్సి ఉందని, అయితే చైనా నుండి మరిన్ని పెట్టుబడులకు దూరంగా ఉంటామనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది మహా ప్రభుత్వం.

English summary

రద్దు చేయలేదు కానీ.. రూ.5,000 కోట్ల చైనా ప్రాజెక్టులపై మహారాష్ట్ర కీలక నిర్ణయం | China investment proposals on hold, not scrapped yet

The Maharashtra government has put on hold Rs 5,020 crore worth of investment proposals from China, as it awaits a central policy on the issue.
Story first published: Tuesday, June 23, 2020, 13:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X