For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నిజమైన విజేత చైనా..! నియంత్రించలేని స్థితిలో అమెరికా..?

|

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ శక్తులుగా ఉన్న దేశాల విషయంలో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా చైనా ఆధిపత్యం, ప్రపంచలో దాని స్థానం విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ స్థితిలో అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, బ్రిటన్‌కు చెందిన ఎంఐ5 సంయుక్తంగా కీలక సంప్రదింపుల సమావేశం నిర్వహించి మీడియాతో కూడా మాట్లాడాయి.

MI5 డైరెక్టర్..

MI5 డైరెక్టర్..

2018తో పోలిస్తే చైనాకు సంబంధించిన పరిశోధనల సంఖ్య ఏడు రెట్లు పెరిగిందని ఎంఐ5 డైరెక్టర్ జనరల్ కెన్ మెక్ కల్లమ్ తెలిపారు. చైనా కార్యకలాపాలు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా.. చైనా ఇతర దేశాల మేధో సంపత్తి దొంగిలించటం, ప్రధాన పాశ్చాత్య దేశాల ఎన్నికలను ప్రభావితం చేయటం ఇప్పుడు ప్రధాన సమస్యలుగా మారాయని వెల్లడించారు. ఈ సమస్యలన్నీ 1990ల నుండి ఉన్నాయి. అయితే.. అమెరికాకు చెందిన FBI, బ్రిటన్ నిఘా సంస్థ MI5 హఠాత్తుగా ఎందుకు చైనాపై ప్రస్తుతం దృష్టి సారించాయనేది ముఖ్యమైన ప్రశ్న.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలను మార్చినట్లుగా.. చైనా విషయంలోనూ చాలా మార్పులు వచ్చింది. సంక్షిప్తంగా.. రష్యా స్థానంలో చైనాను ఉంచడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కానీ చైనా విషయంలో ఎలాంటి తప్పిదాలు చేయకూడదని అమెరికా, బ్రిటన్లు భావిస్తున్నాయి.

చైనా - తైవాన్ వ్యవహారం..

చైనా - తైవాన్ వ్యవహారం..

ప్రస్తుతం చైనా తైవాన్‌ను కైవసం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అలా చేస్తే ఉక్రెయిన్ విషయంలో రష్యాకు ఎదురైన అడ్డంకులే చైనాకూ ఎదురవుతాయి. దీంతో చైనా ముందుగానే ఇందుకు సిద్ధమై బోర్డు నుంచి తప్పుకునే అవకాశాలున్నాయి. రష్యాపై చర్యల విషయంలో.. పాశ్చాత్య దేశాలు సైనిక, ఆర్థిక, రాజకీయ పరంగా ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై చైనా ఇప్పటికే గ్రహించింది. అందువల్ల తైవాన్ విషయంలో చైనా ముందుకు వెళ్లాలని భావిస్తే.. అందుకు అవసరమైన ప్రణాళిక, తయారీ, లిక్విడిటీ విషయాల్లో ముందుగానే సంసిద్ధమౌతుంది.

రష్యా - చైనా జట్టు..

రష్యా - చైనా జట్టు..

ఉక్రెయిన్‌పై దాడికి ముందు వింటర్ ఒలింపిక్స్ ముగిసే వరకు వేచి ఉన్న రష్యా, యుద్ధం జరిగినప్పుడు అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని చైనా హామీ ఇవ్వడంతో ముందుకెళ్లింది. ఇప్పటికే రష్యాకు అవసరమైన అనేక కీలక యుద్ధ సామాగ్రిని చైనా అందిస్తోంది.

నిషేధం కుదరదా..?

నిషేధం కుదరదా..?

ఉదాహరణకు.. జర్మనీ ఇంధనం, గ్యాస్ అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే అమెరికా, బ్రిటన్ వివిధ తయారీ వస్తువుల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో చైనాపై ఎలాంటి నిషేధం విధించినా.. అది కేవలం చైనాకే కాదు తమకు కూడా ప్రమాదమని అమెరికా, బ్రిటన్ దేశాలు ఆలోచనలో ఉన్నాయి. ఇలా పరోక్షంగా యుద్ధం నుంచి చైనా వ్యాపారం పొందుతూ లాభపడుతోంది.

Read more about: china చైనా
English summary

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నిజమైన విజేత చైనా..! నియంత్రించలేని స్థితిలో అమెరికా..? | china benefited with war between russia and ukraine rather than usa or other european powers know how

china benefited with war between russia and ukraine know details
Story first published: Wednesday, July 20, 2022, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X