For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Small Saving Schemes: ప్రజల ఆశలపై నీళ్లు జల్లిన కేంద్రం.. ఉసూరుమనిపించిన వడ్డీ రేట్ల పెంపు..!!

|

Interest Rates: ప్రస్తుత ద్రవ్యోల్బణ సమయంలో పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా పెట్టుబడులపై రాబడులు కావాలని అందరూ ఆశిస్తుంటారు. అందులోనూ చిన్న మెుత్తాల్లో పొదుపు చేసే వారు ప్రభుత్వ నిర్ణయంపై ఆశగా ఎదురుచూస్తున్నారు. కాస్ట్ ఆఫ్ లివ్వింగ్, రూపాయి కొలుగోలు శక్తి వంటి అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ సమయంలోనే వాటి రేట్లపై కేంద్రం ప్రకటన చేసింది.

వడ్డీ రేట్ల పెంపు ఇలా..

వడ్డీ రేట్ల పెంపు ఇలా..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలానికి వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2020-2021 తర్వాత చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు లేవు. ఏమైనప్పటికీ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు నిరుత్సాహకరంగా.. కరోనా తర్వాత పెంచలేదు. దీనిపై ఇన్వెస్టర్లు పెదవి విరుస్తున్నారు.

పోస్టల్ డిపాజిట్స్..

పోస్టల్ డిపాజిట్స్..

వరుసగా రిజర్వు బ్యాంక్ రెపో రేటును నాలుగు సార్లు పెంచింది. ఈ క్రమంలో అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెంచటం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే వీటి పనితీరు పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ రేట్ల కంటే లాభదాయకంగా మారాయి. అందువల్ల పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడిదారులు పెట్టిన వారు రేట్లు పెంపు ఎక్కువగా ఉండవచ్చని భావించారు.

రేటు పెంపు ఎంతంటే..

రేటు పెంపు ఎంతంటే..

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న పొదుపు పథకాలపై చెల్లిస్తున్న వడ్డీ రేట్లను 0.30 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇది పెట్టుబడిదారులు ఆశించినదానికంటే చాలా తక్కువగా ఉంది.

రేట్లు మారిన తర్వాత..

రేట్లు మారిన తర్వాత..

కొత్త వడ్డీ రేటు పెంపు తర్వాత 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేటు 5.50 శాతం నుంచి 5.80 శాతానికి పెరిగింది. ఇది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడవ త్రైమాసికానికి మాత్రమే వర్తిస్తుంది. ఇదే సమయంలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేటు 0.20 శాతం పెరగటంతో వారికి చెల్లించే వడ్డీ రేటు 7.60 శాతానికి చేరుకుంది.

English summary

Small Saving Schemes: ప్రజల ఆశలపై నీళ్లు జల్లిన కేంద్రం.. ఉసూరుమనిపించిన వడ్డీ రేట్ల పెంపు..!! | Central government raised Small Saving Schemes interest rates by 0.30 percent dissapointed investors

Central government raised Small Saving Schemes interest rates by 0.30 percent dissapointed investors
Story first published: Friday, September 30, 2022, 16:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X