For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెనరా బ్యాంక్ క్యూఐపీ: ఈక్విటీ షేర్ విలువ ఫిక్స్: రూ.2,000 కోట్లకు టార్గెట్

|

ముంబై: కెనరా బ్యాంక్.. తన క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ)ని ప్రకటించింది. క్యూఐపీ కోసం కోసం బ్యాంకు యాజమాన్యం ఇదివరకే షేర్ హోల్డర్ల నుంచి అంగీకారాన్ని తీసుకుంది. దీనికి అనుగుణంగా క్యూఐపీ విలువను నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలతో కూడిన ప్రతిపాదనలను బ్యాంకింగ్ రెగ్యులేటరీ వద్ద ఫైల్ చేసింది. బోర్డు డైరెక్టర్లు సభ్యులుగా ఉన్న సబ్ కమిటీ సమావేశంలో క్యూఐపీ ప్రైస్ విలువను నిర్ధారించింది.

ఒక్కో ఈక్విటీ షేర్ ఫ్లోర్ ప్రైస్ విలువ.. 103.50 రూపాయలుగా ఫిక్స్ చేసినట్లు కెనరా బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. దీని ద్వారా కనీసం 2,000 కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. క్యూఐపీల రూపంలో ఇంత భారీ మొత్తాన్ని సేకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. దీనికోసం షేర్ హోల్డర్ల నుంచి ఇప్పటికే అంగీకారాన్ని తీసుకున్నామని వివరించింది. ఈ ఏడాది ఆగస్టులో షేర్ హోల్డర్లతో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాము క్యూఐపీ ఫ్లోర్ ప్రైస్‌ను నిర్ధారించినట్లు స్పష్టం చేసింది.

Canara Bank has set a floor price of Rs 103.50 per share for its QIP to raise up to Rs 2,000 crore

బోర్డు డైరెక్టర్లతో కూడిన క్యాపిటల్ ప్లానింగ్ ప్రాసెసింగ్ విభాగం సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో పొందుపరిచిన అంశాల మేరకు ఫ్లోర్ ప్రైస్ విలువను ఫిక్స్ చేసింది. క్యూఐపీ ఇష్యూ ఓపెనింగ్ ప్రైస్ 103.50లకు సబ్ కమిటీ అనుమతి ఇచ్చినట్ల బ్యాంకు యాజమాన్యం తన రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లల్లో వివరించింది. సబ్ కమిటీ ఇచ్చిన తాజా ప్రతిపాదనలపై ఈ నెల 10వ తేదీన నిర్వహించే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో చర్చిస్తామని, ఆ వెంటనే వాటిని లాంఛనప్రాయంగా ఆమోదిస్తామని పేర్కొంది.

ఎన్ని క్యూఐపీ ఈక్విటీ షేర్లను జారీ చేయాలి? ఎంత మొత్తాన్ని సేకరించాలి? క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల వాటా కింద ఎన్ని షేర్లను కేటాయించాలి? అనే అంశాలపై గురువారం జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల భేటీలో నిర్ణయిస్తామని కెనరా బ్యాంకు యాజమాన్యం తన ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా- సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో రికార్డయిన వివరాల ప్రకారం.. కెనరా బ్యాంక్ క్యూఐపీ ఫ్లోర్ ప్రైస్ 117.55 రూపాయల వద్ద ముగిసింది. ఇదివరకటి క్లోజర్‌తో పోల్చుకుంటే.. తాజా ఫ్లోర్ ప్రైస్ విలువ 5.62 రూపాయలు అధికం.

English summary

కెనరా బ్యాంక్ క్యూఐపీ: ఈక్విటీ షేర్ విలువ ఫిక్స్: రూ.2,000 కోట్లకు టార్గెట్ | Canara Bank has set a floor price of Rs 103.50 per share for its QIP to raise up to Rs 2,000 crore

Canara Bank on Monday said it has set a floor price of Rs 103.50 per share for its qualified institutional placement (QIP) to raise up to Rs 2,000 crore. The bank had received shareholders' nod in its annual general meeting, held in August, for raising up to Rs 2,000 crore by way of QIP.
Story first published: Tuesday, December 8, 2020, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X