For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బైజూస్ చేతికి ముంబై కంపెనీ... డీల్ విలువ రూ 2,000 కోట్లకు పైనే!

|

ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన బెంగళూరు స్టార్టుప్ కంపెనీ బైజూస్... ఇప్పుడు అదే రంగంలో పోటీ సంస్థలఫై కన్నేసింది. తన సొంత ప్లాట్ఫారం కు మరింత విలువ జోడించగల ఎడ్యు టెక్ కంపెనీల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే డెకాకార్న్ క్లబ్ (10 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలను ఇలా పిలుస్తారు) లో చేరిపోయిన బైజూస్ వద్ద రూ వేల కోట్ల ఇన్వెస్టర్ల నిధులు పోగు పడిపోయాయి.

దీంతో ఆ నిధులతో ఒక వైపు సొంత ప్లాట్ఫారం ను అభివృద్ధి చేస్తూ, విస్తరిస్తూ పోతూనే .. మరోవైపు విద్య రంగంలో టెక్నాలజీ ఆధారిత స్టార్టుప్ కంపెనీలను సొంతం చేసుకోవటం ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవటంతో పాటు పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బైజూస్ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ని కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లిస్తోంది.

కరోనా దెబ్బకు దివాలా కోర్టుకు అమెరికా దిగ్గజ విమాన కంపెనీ

వైట్ హాట్ జూనియర్...

వైట్ హాట్ జూనియర్...

ముంబై కేంద్రంగా 2018 లో వైట్ హాట్ జూనియర్ ను కరణ్ బజాజ్ స్థాపించారు. ఈ కంపెనీ కే-12 సెగ్మెంట్ లో పిల్లలకు ఆన్లైన్ లో కోడింగ్ పై శిక్షణ ఇస్తుంది. స్టూడెంట్స్ లో కోడింగ్ పై ఆసక్తి ని పెంపొందించటంతో పాటు వారు పూర్తిస్థాయిలో గేమ్స్, ఆనిమేషన్, మొబైల్ ఆప్స్ ను అభివృద్ధి చేసేలా శిక్షణ ఇస్తుంది. ఇవి కూడా వాణిజ్య పరంగా పనికొచ్చేలా ఉండటం విశేషం.

దీంతో అనతి కాలంలోనే వైట్ హాట్ జూనియర్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా మహానగరాల్లో ఈ కంపెనీకి విపరీతమైన ప్రాచుర్యం ఏర్పడింది. దీనిని ఏర్పాటు చేసిన కరణ్ బజాజ్ గతంలో డిస్కవరీ నెట్వర్క్స్ ఇండియా కు సీఈఓ గా వ్యవహరించారు. ఈ కంపెనీ సొంతంగా ప్రొప్రయిటరీ కోడింగ్ కరికులం రూపొందించింది. దీంతో ఆన్లైన్ లో ఇంటరాక్టివ్ క్లాసులు చెప్పేందుకు అనుకూలంగా ఉంటోంది. ఈటీ కథనం ప్రకారం... వైట్ హాట్ జూనియర్ దాదాపు 150 మిలియన్ డాలర్ల (సుమారు రూ 1,125 కోట్లు) ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు సమాచారం.

రూ 2,250 కోట్ల డీల్...

రూ 2,250 కోట్ల డీల్...

ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే వైట్ హాట్ జూనియర్ సాధించిన ప్రగతి ని చూసి... బైజూస్ మనసుపారేసుకుంది. అందుకే వెంటనే ఈ కంపెనీని చేజిక్కించుకోవాలని పావులు కదిపింది. సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 2,250 కోట్లు) చెల్లించి వైట్ హాట్ జూనియర్ ను సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడింది.

అయితే అందులో డీల్ సైజు వెల్లడించలేదు. ప్రస్తుత లావాదేవీ ప్రకారం వైట్ హాట్ జూనియర్ కు నగదు రూపంలోనే నిధులను చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. డీసీ అడ్వైసర్స్ అనే సంస్థ ఈ లావాదేవీకి ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది. బైజూస్ పేరెంట్ సంస్థ ఐన థింక్ అండ్ లెర్న్ పేరిట ఈ డీల్ జరిగింది.

అమెరికా లో కూడా...

అమెరికా లో కూడా...

వైట్ హాట్ జూనియర్ కొనుగులు పూర్తి ఐన తర్వాత ... దానిని కూడా బైజూస్ ప్లాట్ఫారం కు అనుసంధిస్తారు. దీంతో బైజూస్ ప్లాట్ఫారం పై అందించే సేవల విస్తృతి పెరుగుతుంది. అదే సమయంలో ఇటు ఇండియా తో పాటు అమెరికా లో కూడా ఈ సేవలను అందించటంతో పాటు అక్కడ మార్కెట్ ను బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుత లావాదేవీ దోహదపడుతుంది.

మరోవైపు... వైట్ హాట్ జూనియర్ వ్యవస్థాపకుడు కరణ్ బజాజ్ కొనుగోలు అనంతరం కూడా కంపెనీలో కొనసాగుతారు. దీనిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఆయన సహకరిస్తారు. ఇదిలా ఉండగా.... అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కె - 12 సెగ్మెంట్ లో మరింత దూసుకు వెళ్లేందుకు వైట్ హాట్ జూనియర్ లో బైజూస్ భారీగా పెట్టుబడులు కూడా పెట్టనున్నట్లు సమాచారం.

English summary

Byjus parent buys WhiteHat Jr in dollar 300m cash deal

Think and Learn which owns and operates education technology platform Byju’s — The Learning App — has acquired Mumbai-based WhiteHat Jr in a $300 million all-cash transaction, according to an announcement late Wednesday evening.
Story first published: Thursday, August 6, 2020, 15:31 [IST]
Company Search