For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌదీ అరేబియా కీలక నిర్ణయం, చమురు ధరల షాక్: ధరల కోసం ఒపెక్ దేశాల వ్యూహం

|

చమురు ధరలు ఎగిసిపడుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బుధవారం 2020 ఫిబ్రవరి గరిష్టాన్ని తాకాయి. మంగళవారం దాదాపు 5 శాతం జంప్ చేసిన ధరలు నేడు కూడా పెరిగాయి. చమురు ఉత్పత్తిలో స్వచ్చంధ కోతకు సౌదీ అరేబియా సిద్ధమైంది. ఈ ప్రభావం చమురు ధరలపై పడింది. చమురు ఉత్పత్తి దేశాలు ఇటీవల సమావేశమైనప్పుడు ఉత్తత్తి కోతపై నిర్ణయం తీసుకున్నాయి. ఆ సమయంలో అంచనాల కంటే ఎక్కువగా సౌదీ అరేబియా ఉత్పత్తి కోతకు సిద్దఫడింది. దీంతో చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ITR filing deadline: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా.. జనవరి 10 వరకు గడువు పొడిగింపుITR filing deadline: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా.. జనవరి 10 వరకు గడువు పొడిగింపు

ఫిబ్రవరి గరిష్టానికి చమురు ధరలు

ఫిబ్రవరి గరిష్టానికి చమురు ధరలు

బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 0.6 శాతం ఎగిసి 53.94 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి 26, 2020 తర్వాత బ్రెంట్ క్రూడా ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మంగళవారం 4.9 శాతం లాభపడి 53.79 డాలర్ల వద్ద ముగిసింది. నేడు మరింత పెరిగింది.ఇక, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్(WTI) ఫ్యూచర్ 13 సెంట్లు (0.26 శాతం) లాభపడి బ్యారెల్‌కు 50.06 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డబ్ల్యుటీఐ కాంట్రాక్ట్ మంగళవారం 4.6 శాతం ఎగిసి 49.93 డాలర్ల వద్ద ముగిసింది. 2020 ఫిబ్రవరి 24 తర్వాత ఇదే గరిష్టం.

సౌదే అరేబియా కీలక నిర్ణయం

సౌదే అరేబియా కీలక నిర్ణయం

ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉ్పత్తి, ఎగుమతిదారు సౌదీ అరేబియా మరింత ఉత్పత్తిని తగ్గించుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే(bpd) తగ్గించాలని నిర్ణయించింది. ఓ వైపు కరోనా నుండి కోలుకొని పరిస్థితులు కాస్త సానుకూలంగా కనిపిస్తుంటే మరోవైపు ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడం డిమాండ్‌ను పెంచింది.

చమురు ఉత్పత్తి తగ్గింపుతో డిమాండ్

చమురు ఉత్పత్తి తగ్గింపుతో డిమాండ్

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు మద్దతుగా ఒపెక్ సహా రష్యా వరకు మూడేళ్లుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్, ఆర్థిక మందగమనం, కరోనా సంక్షోభాల నేపథ్యంలో చమురుకు డిమాండ్ తగ్గింది. దీంతో ఉత్పత్తి నియంత్రణతో ధరల నిలకడకు చమురు ఉత్పత్తి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే 2017 జనవరి నుంచి ఉత్పత్తి కోత అమలు చేస్తున్నాయి. తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సౌదీ అరేబియా అదనపు కోతలకు సిద్ధమని తెలియజేసింది.

English summary

సౌదీ అరేబియా కీలక నిర్ణయం, చమురు ధరల షాక్: ధరల కోసం ఒపెక్ దేశాల వ్యూహం | Brent oil rises to highest since February after Saudi Arabia output cut

Brent oil prices rose on Wednesday to the highest since February after Saudi Arabia agreed to make bigger cuts in output than expected during a meeting with allied producers, while industry data showed U.S. crude stockpiles fell last week.
Story first published: Wednesday, January 6, 2021, 13:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X