For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bitcoin Falls: 40,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్

|

క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ పతనం కొనసాగుతోంది. డిజిటల్ టోకెన్స్‌‍లో దాదాపు సగం వాటా బిట్‌కాయిన్‌‍దే. ఇలాంటి క్రిప్టో మహాపతనం నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ మార్కెట్ భారీగా క్షీణించింది. ఇది 200 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువకు పడిపోయింది. అంచనాల కంటే ముందే యూఎస్ లిక్విడిటీ ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఇటు క్రిప్టో కరెన్సీ పైన, మరోవైపు పసిడి మార్కెట్ పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. బిట్ కాయిన్ సోమవారం 40,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ 40,800 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సెప్టెంబర్ 2021 తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. 2022 క్యాలెండర్ ఏడాదిలో బిట్ కాయిన్ భారీగా పతనమైంది.

గత కొన్నేళ్లలోనే బిట్ కాయిన్‌‌కు ఏడాది ప్రారంభంలో ఇది అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. నవంబర్ పదో తేదీన బిట్ కాయిన్ 69,000 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈ స్థాయితో పోలిస్తే ప్రస్తుతం నలభై శాతం పడిపోయింది. గత వారం రోజుల్లోనే పన్నెండు శాతం పడిపోయింది. గతంలో 2014, 2018లలో బిట్ కాయిన్ భారీగా క్షీణించింది. అడపా దడపా ఆయా సంవత్సరాల్లోని కొన్ని నెలల్లోను భారీ పతనం నమోదు చేసింది.

Bitcoin Falls Below $40K as ‘Death Cross’ Looms in Price Charts

నేటి ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే ఎక్కువగా పతనమయ్యాయి. టెర్రా మాత్రం ఎగిసిపడింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ ఏకంగా 1.97 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. 2 ట్రిలియన్ డాలర్ల దిగువకు వచ్చింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 23 శాతం క్షీణించి 71.19 బిలియన్ డాలర్లుగా నమోదయింది. బిట్ కాయిన్, సోలానా, కార్డానో, ఎక్స్‌‍‌పీఆర్ భారీగా నష్టపోయాయి. అదే సమయంలో ఎథేరియం, బీఎన్బీ, టెర్రా, పోల్కాడాట్ లాభపడ్డాయి. టెర్రా ఆరు శాతం మేర వృద్ధి చెందింది.

English summary

Bitcoin Falls: 40,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్ | Bitcoin Falls Below $40K as ‘Death Cross’ Looms in Price Charts

They call it bitcoin’s “death cross” – a bearish indicator which appears when the 50-day moving average (MA) dips below the 200-day MA.
Story first published: Monday, January 10, 2022, 20:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X