For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త శిఖరాలకు.. భారీ లాభాల్లో మార్కెట్లు, సెన్సెక్స్ 610 పాయింట్లు జంప్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఫిబ్రవరి 15) భారీ లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ అనంతరం పరుగులు తీస్తున్న సూచీలు, మధ్యలో రెండు మూడు సెషన్లు అతి స్వల్పంగా నష్టపోయినప్పటికీ, మళ్లీ పుంజుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 52వేల మార్కును దాటింది. నిఫ్టీ 15,300 పైన ట్రేడ్ అయింది. సూచీలు ప్రారంభం నుండి భారీ లాభాల్లోనే ఉన్నాయి. ఏ సమయంలోను కిందకు రాలేదు. ఇక, డాలర్ మారకంతో రూపాయి 7 పైసలు బలపడి 72.68 వద్ద క్లోజ్ అయింది. 72.57 వద్ద గరిష్టాన్ని, 72.69 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్, వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్!ఉద్యోగులకు గుడ్‌న్యూస్, వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్!

600 పాయింట్లు జంప్

600 పాయింట్లు జంప్

నేడు సెన్సెక్స్ 609.83 పాయింట్లు లేదా 1.18% లాభపడి 52,154.13 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 151.40 పాయింట్లు లేదా 1% ఎగిసి 15,314.70 పాయింట్ల వద్ద ముగిసింది. 1337 షేర్లు లాభాల్లో, 1648 షేర్లు నష్టాల్లో ముగియగా, 149 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ ఉదయం 51,907.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,235.97 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,886.46 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు 650 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. నిఫ్టీ 15500 పాయింట్ల దిశగా సాగుతోంది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 5.81 శాతం, ICICI బ్యాంకు 4.07 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.63 శాతం, SBI 3.51 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.94 శాతం లాభపడ్డాయి.

నేటి టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 2.21 శాతం, SBI లైఫ్ ఇన్సురా 2.19 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.71 శాతం, TCS 1.60 శాతం, హీరో మోటో కార్ప్ 1.43 శాతం లాభపడ్డాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.

అందుకే లాభాల్లో

అందుకే లాభాల్లో

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు ఎగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, స్థిరాస్తి, PSU, టెలికాం, ఇన్ఫ్రా రంగాలు అండగా నిలిచాయి. FII పెట్టుబడుల భారీగా రావడం, రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ఠానికి చేరడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలోకి రావడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. బ్యాంకింగ్ రంగ సూచీ 3.25 శాతం మేర లాభపడింది.

నిఫ్టీ 50 స్టాక్స్ 1.00 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.79 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.40 శాతం, నిఫ్టీ బ్యాంకు 3.32 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.87 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.09 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.32 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.50 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.32 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఎనర్జీ 0.22 శాతం, నిఫ్టీ ఐటీ 0.36 శాతం, నిఫ్టీ మీడియా 0.31 శాతం, నిఫ్టీ మెటల్ 0.47 శాతం, నిఫ్టీ ఫార్మా 0.32 శాతం నష్టపోయాయి.

English summary

సరికొత్త శిఖరాలకు.. భారీ లాభాల్లో మార్కెట్లు, సెన్సెక్స్ 610 పాయింట్లు జంప్ | Bank, financial stocks lift Sensex 610 points, Nifty above 15,300

At the interbank forex market, the local unit opened at 72.61 against the greenback and witnessed an intra-day high of 72.57 and a low of 72.69.
Story first published: Monday, February 15, 2021, 17:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X