For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యస్ బ్యాంకుకు పెట్టుబడులు వెల్లువ, మరో 2 బ్యాంకులు ముందుకు

|

సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకులో ఎస్బీఐ, ఐసీసీఐసీఐ, హెచ్‌డీఎప్‌సీ, కొటక్ మహీంద్రా తదితర బ్యాంకులు పెట్టుబడి పెట్టనున్నాయి. బంధన్ బ్యాంకు కూడా రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

Yes Bank: త్వరలో డిపాజిటర్లకు ఊరట, 4 బ్యాంకుల చేయూతYes Bank: త్వరలో డిపాజిటర్లకు ఊరట, 4 బ్యాంకుల చేయూత

రూ.8కి అధికంగా 30 కోట్ల ఈక్విటీ షేర్లు

రూ.8కి అధికంగా 30 కోట్ల ఈక్విటీ షేర్లు

దీని ప్రకారం రూ.2 ముఖ విలువ కలిగి ఉన్న షేరును రూ.8కి అధికంగా అంటే రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. ఈ ట్రాన్సాక్షన్స్ నగదు రూపంలో జరుగుతుంది.

ఫెడరల్ బ్యాంకు కూడా..

ఫెడరల్ బ్యాంకు కూడా..

యస్ బ్యాంకులో రూ.300 కోట్ల పెట్టుబడికి ఫెడరల్ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. బ్యాంకులోని 30 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. యస్ బ్యాంకు లిమిటెడ్‌లో 30 కోట్ల ఈక్విటీ షేర్లను, ఒక్కో షేరుకు రూ.10 చొప్పున రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు ఈక్విటీ కమిట్‌మెంట్ లెటర్‌ను జారీ చేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ బ్యాంకులు ఓకే..

ఇప్పటికే ఈ బ్యాంకులు ఓకే..

యస్ బ్యాంకులో 49 శాతం వాటాను కొనుగోలు చేయాలని ఇప్పటికే ఎస్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌స, ఐసీఐసీఐ చెరో రూ.1000 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ.600 కోట్లు, కొటక్ మహంద్రా బ్యాంకు రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి.

మేజర్ వాటా ఈ బ్యాంకులదే..

మేజర్ వాటా ఈ బ్యాంకులదే..

ఈ బ్యాంకులు ఇన్వెస్ట్ చేసే మొత్తమే యస్ బ్యాంకులో దాదాపు 70 శాతం వాటా అవుతుంది. ఈ ఐదు ఆర్థిక సంస్థల చేతుల కనుసన్నుల్లోనే అన్నీ ముందుకు సాగవచ్చు. పునరుద్ధరణ ప్రణాళిక, షేర్ల జారీ అనంతరం తుది వాటాలపై స్పష్టత వస్తుంది.

English summary

యస్ బ్యాంకుకు పెట్టుబడులు వెల్లువ, మరో 2 బ్యాంకులు ముందుకు | Bandhan Bank to invest Rs.300 crore in YES Bank

Private sector Bandhan Bank said it will invest Rs 300 crore in YES Bank as part of RBI's reconstruction plan for the crisis-hit lender.
Story first published: Sunday, March 15, 2020, 13:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X