For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశాఖపట్నంలో సరికొత్త పెట్రోల్ బంక్: స్మార్ట్ పేతో మీరే పెట్రోల్ నింపుకోవచ్చు

|

విశాఖపట్నం: వాహనాల్లో పెట్రోల్, డీజిల్ కావాలంటే బంకులకు వెళ్లాలి. అక్కడ ఉన్న సిబ్బంది మనం ఎంత చెబితే అంత పంపు ద్వారా మన వాహనంలో నింపుతారు. అయితే త్వరలో పెట్రోల్ బంకుల్లో సిబ్బంది లేకుండానే సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభిస్తోంది.

మోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమందిమోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమంది

విశాఖలోని మిలీనియం పెట్రోల్ స్టేషన్‌లో..

విశాఖలోని మిలీనియం పెట్రోల్ స్టేషన్‌లో..

అప్పుడు బంకుల్లో సిబ్బంది అవసరం లేకుండానే మీకు మీరు వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపుకోవచ్చు. వైజాగ్‌లోని సిరిపురం జంక్షన్‌లోని మిలీనియం పెట్రోల్ స్టేషన్‌లో HPCL మీకు మీరే పెట్రోల్ నింపుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది. దీనిని ఆటోమేటెడ్ పెట్రోల్ పంపు లేదా ఈ-ఫ్యూయల్ స్టేషన్‌గా పిలువవచ్చు. సిరిపురం జంక్షన్‌లో దీనిని త్వరలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా దీనిని పరిశీలించారు.

అన్నింటా ఆటోమేటెడ్ సాంకేతిక

అన్నింటా ఆటోమేటెడ్ సాంకేతిక

వచ్చే ఏడాది (2020) ప్రారంభంలో ఈ ఆటోమేటెడ్ పెట్రోల్ బంకు సేవలను వాహనదారులు పొందవచ్చు. ఇక్కడి ఈ-ఫ్యూయల్ స్టేషన్లోని అన్ని పంపులకు కూడా ఆటోమేటెడ్ సాంకేతికతను అనుసంధానం చేస్తారు. ఇక్కడ దాదాపు మ్యాన్యువల్ అంశాలు అన్నింటిని తొలగిస్తారు.

స్మార్ట్ చెల్లింపులు

స్మార్ట్ చెల్లింపులు

ఈ ఆటోమేటెడ్ పంపుల్లో నగదు ట్రాన్సాక్షన్స్ కూడా నగదురహితంగానే అంటే డిజిటల్ రూపంలో ఉంటాయి. డెబిట్, క్రెడిట్, ఇతర స్మార్ట్ కార్డులను HPCL రీఫ్యూయల్ యాప్ సహాయంతో నిర్వహించుకోవాలి. QR కోడ్ స్కాన్ సదుపాయం కూడా ఉంది. కస్టమర్ తానే స్వయంగా ఎన్ని లీటర్ల డీజిల్/పెట్రోల్ అవసరమో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కనిపించే నగదు మొత్తానికి కార్డు స్వైప్ చేయాలి. తర్వాత పెట్రోలు పోసే గన్ పని చేసి, మీరు ఎంటర్ చేసిన మొత్తానికి ఇంధనం ట్యాంకులో పడుతుంది. ఏదైనా అత్యవసరమైతే అక్కడే ఉన్న సిబ్బంది సహకరిస్తారు.

English summary

విశాఖపట్నంలో సరికొత్త పెట్రోల్ బంక్: స్మార్ట్ పేతో మీరే పెట్రోల్ నింపుకోవచ్చు | Automated petrol pump, first in Andhra, to come up in Vizag

For the first time in Andhra Pradesh, an automated petrol pump or ‘e-fuel station’ is going to be installed at the Millennium Petrol station at Siripuram Junction in the city. The station is owned by HPCL.
Story first published: Monday, December 16, 2019, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X